శ్రీవారికీ తప్పని నష్టాలు! ఇది ఇలా ఉండగా, తిరుపతికి వచ్చే యాత్రికులు వరుసగా మూడవ రోజు కూడా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. బంద్ కారణంగా ఆర్టీసి పూర్తి స్థాయిలో బస్సు సర్వీసులు నడపలేదు. వాస్తవానికి గడచిన మూడు రోజులుగా జిల్లావ్యాప్త నిరసన ప్రదర్శనల వల్ల తమిళనాడు ఆర్టీసికి చెందిన 148 బస్సు సర్వీసులు, కర్నాటక ఆర్టీసికి చెందిన 120 బస్సు సర్వీసులు నడవలేదు. ఎపిఎస్ఆర్టీసి అధికారుల సమాచారం ప్రకారం, తిరుమల తిరుపతి మధ్య మొత్తం 450 బస్సు సర్వీసులకు 165 మాత్రమే ఆదివారం నడిచాయి.
సంస్థకు గడచిన మూడు రోజులలోనే రూ. 5 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని ఆర్టీసి ప్రాంతీయ అధికారి ఒకరు చెప్పారు. 'సాధారణంగా ప్రతి రోజు టిక్కెట్ల అమ్మకం ద్వారా కోటి రూపాయలు వసూలు అవుతుండేవి. కాని రోజు వసూళ్ళు రూ. 10 లక్షలు మాత్రమే ఉన్నాయి. మామూలు రోజుల్లో రూ. 30 లక్షల ఆదాయం సంపాదిస్తుండే తిరుమల, తిరుపతి బస్సులు గడచిన మూడు రోజుల్లో రూ. 8 లక్షలు మాత్రమే ఆర్జించాయి' అని ఆయన వాపోయారు. 1420 అంతర్ జిల్లా సర్వీసులు అన్నిటినీ నిలిపివేయడంతో ఆర్టీసికి భారీగా నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. ఆందోళనకారులు 11 బస్సులను ధ్వంసం చేయడం వల్ల కోటి రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు.
ఇది ఇలా ఉండగా, సమైక్య ఆంధ్ర నిరసనలు పుణ్యక్షేత్రం తిరుమలకు కూడా విస్తరించాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తిరుమలపై గల బాలాజీనగర్ ప్రాంతంలో 'జై సమైక్య ఆంధ్ర' నినాదాలు, తెలంగాణ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆతరువాత పోలీసులు ఆందోళనకారులను నిర్బంధంలోకి తీసుకున్నారు.
Pages: -1- 2 News Posted: 15 December, 2009
|