ఎరగా భాగ్యనగరి? హైదరాబాద్ కు చెందిన కొందరు కాంగ్రెస్ ఎంఎల్ఎలు కూడా రాష్ట్ర రాజధానికి యుటి హోదా కల్పనకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాని ఎంఐఎం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నది. 'హైదరాబాద్ కనుక తెలంగాణలో భాగంగా ఉంటే ఎంఐఎం గణనీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. వారు తమ బలాన్ని పెంచుకోవచ్చు. కాని కాంగ్రెస్ నుంచి వచ్చే రాజకీయ ఒత్తిడుల వల్ల ఆ పార్టీ యుటి హోదాకు అంగీకరించవలసి రావచ్చు. ఆ పార్టీ కాంగ్రెస్ పట్ల అంసతుష్టితో ఉన్న సూచనలు గోచరిస్తున్నాయి. ఈ అంశంపై తమను ఏమాత్రం సంప్రదించలేదని ఎంఐఎం చెబుతున్నది' అని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు.
రాష్ట్రం విభజనను తాము ఎంతగా వ్యతిరేకిస్తే హైదరాబాద్ కు ప్రత్యేక ప్రతిపత్తి లభించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని యుటి హోదాకు అనుకూలంగా ఉన్న నాయకులు అంటున్నారు. 'రాష్ట్ర విభజన కూడదంటూ పట్టుపట్టిన తరువాత హైదరాబాద్ ను యుటిగా చేసినట్లయితే రాష్ట్ర విభజనకు మేము అంగీకరించిన పక్షంలో కేంద్రం ఇందుకు అంగీకరించే అవకాశాలు ఇతోధికంగా ఉంటాయి' అని ఒక నాయకుడు చెప్పారు.
ఇది ఇలా ఉండగా తెలంగాణయేతర ప్రాంతాల ఎంఎల్ఎలు బుధవారం మాజీ మంత్రి జె.సి. దివాకరరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, హైదరాబాద్ కు యుటి హోదా మంజూరుకు అనుకూలంగా తమ ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు ప్రముఖ సమైక్యాంధ్ర వాది, కర్నూలు ఎంఎల్ఎ టి.జి. వెంకటేశ్ ను వారు కన్వీనర్ గా నియమించారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధిని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలుసుకుని తమ అభిప్రాయాలను నివేదించాలని ఎంఎల్ఎలు అనుకుంటున్నారు.
Pages: -1- 2 News Posted: 17 December, 2009
|