సరిహద్దు 'సమైక్యం' ఆంధ్ర ప్రదేశ్ విభజనకు కుట్ర పన్నినందుకు కేంద్ర మంత్రులు పి. చిదంబరం, ఎం. వీరప్ప మొయిలీలను ప్రతి ఒక్కరూ తప్పు పట్టుతున్నారని మరొక సేన నాయకుడు కేశవరావు చెప్పారు. 'మనలో మనకే ఐక్యత లేనప్పుడు ఇతరులు నిందించి ప్రయోజనమేముంది. కర్నాటకలోని కోలారు, బేతమంగళం, గుట్టహళ్ళె, కామసంద్ర ప్రాంతాలలో కూడా సమైక్యత సందేశాన్ని మేము వ్యాపింపచేస్తాం' అని కేశవరావు తెలిపారు.
ఈ వినూత్న ప్రచారానికి సూత్రధారుడైన తెలుగు దేశం పార్టీ (టిడిపి) మాజీ జిల్లా అధ్యక్షుడు రావూరి ఈశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి, ఒక ప్రాంతం పట్ల నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి రాష్ట్ర విభజన మార్గం కాదని అన్నారు. 'పాలకులు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రజల ఐకమత్యానికి ముప్పు తీసుకురారాదు' అని అన్నారు.
అనేక వేల మంది తమిళులు, కన్నడిగులు యాత్ర, విద్య, వ్యాపార అవసరాలపై చిత్తూరు జిల్లాలోకి వస్తుంటారని ఆయన తెలిపారు. 'వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని చెప్పి వారిని ఇక్కడికి రావద్దని అడ్డుకోలేం కదా. విస్తృత సమస్యల పరిష్కారానికి సంఘటితంగా వ్యవహరించడంలోనే మనకు విశ్వాసం ఉండాలి' అని ఈశ్వరరావు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలన్న తన ప్రతిపాదన అమలుకు కేంద్రం పూనుకోరాదని, ఎందుకంటే ఇది ఆంధ్ర ప్రదేశ్ కే చేటు కాగలదని ఆయన అన్నారు.
ఇది ఇలా ఉండగా, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి సమీపంగా ఉన్న తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో తమిళులు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తమ జిల్లాను గ్రేటర్ రాయలసీమలో విలీనం చేయాలని వారు కోరారు. 'తమిళనాడులో తిరువణ్ణామలై వంటి ఉత్తర ఆర్కాడ్ జిల్లా ప్రాంతాలను కూడా గ్రేటర్ రాయలసీమ రాష్ట్రంలో విలీనం చేయాలి' అని పేరు వెల్లడికి ఇష్టపడని నాయకుడు ఒకరు కోరారు.
Pages: -1- 2 News Posted: 17 December, 2009
|