సోనియా 'సంధి' చిట్కా? అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించే ప్రక్రియను వాయిదా వేయడం ద్వారా తెలంగాణ వ్యతిరేకులను సముదాయించగా, యుపిఎ మిత్రపక్షాల అభ్యంతరాలను ఈ అంశంపై జాప్యాన్ని సమర్థించుకోవడానికి ఒక కారణంగా ఉపయోగించుకుంటున్నారు. తొందరపాటుతో ప్రకటన చేసిన తరువాత తాను వెనుకకు తగ్గుతున్నానన్న అభిప్రాయాన్ని కలిగించాలని కేంద్రం కోరుకోవడం లేదు. ఇదే కనుక జరిగినట్లయితే తెలంగాణ ప్రాంతంలో మరొకదఫా హింసాయుతంగా ఆందోళన సాగే ప్రమాదం ఉంది.
తడబడుతూ అడుగులు వేసిన తరువాత పరిస్థితిని సర్దుబాటు చేసే బాధ్యతను వెటరన్ ప్రణబ్ ముఖర్జీకి అప్పగించారు. సాగతీతకు కారణాల అన్వేషణలో ఆయన నిమగ్నమయ్యారు. ఎన్ సిపి ఇదివరకే తెలంగాణకు అనుకూలంగా ఒక తీర్మానాన్ని ఆమోదించినందున, పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ టిఆర్ఎస్ నేత కె. చంద్రశేఖరరావు (కెసిఆర్)తో కలసి ఒక ర్యాలీలో ప్రసంగించినందున, మిత్ర పక్షాలు ఉమ్మడిగా వ్యతిరేకించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, తెలంగాణ వ్యతిరేక ఉద్యమంపై విరుచుకుపడడానికి కాంగ్రెస్ పార్టీకి సిసిపిఎలో అసమ్మతి మరొక ఆయుధంగా ఉపకరించింది.
చివరకు తెలంగాణ అనుకూల నాయకులు కూడా అర్ధరాత్రి ప్రకటనపై ప్రణబ్ తరహా ముద్ర లేదని భావిస్తున్నారు. పరిస్థితిని సర్దుబాటు చేసే క్రమంలో చిదంబరాన్ని పక్కకు నెట్టడాన్ని వారు సమర్థిస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక ఉద్యమంపై విరుచుకుపడిన ప్రభావం కొట్టవచ్చినట్లు కనిపించిందనడానికి సూచిక జగన్మోహన్ రెడ్డి బుధవారం రంగంలో కనిపించకపోవడమే. జగన్మోహన్ రెడ్డి మంగళవారం టిడిపి సభ్యులతో కలసి 'సమైక్య ఆంధ్ర' ప్లకార్డును ప్రదర్శించిన విషయం విదితమే. జగన్ తన చర్యకు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని, కేంద్రంలో జూనియర్ మంత్రిగా ఆయనను చేర్చుకోవాలనే ఆలోచనకు దాదాపుగా స్వస్తి చెప్పారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Pages: -1- 2 News Posted: 17 December, 2009
|