బాబుపై చిరు దెబ్బ
శాసనసభకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం వీథి పోరాటాలు సాగించవలసిందిగా తమ నియోజకవర్గాల ప్రజలు తమను విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల శాసనసభ్యులు ఇప్పటికే చంద్రబాబుకు తెలియజేశారు. 'మా రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ కు నచ్చజెప్పాల్సిందిగా వారు మమ్మల్ని కోరుతున్నారు. ఈ వివాదాస్పద అంశంపై పార్టీ ఏ వైఖరి అనుసరించాలో చంద్రబాబు నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీకి గుడ్ బై చెప్పడం సహా తీవ్రమైన చర్యలు మేం తీసుకొనవలసి రావచ్చు' అని టిడిపి ఎంఎల్ఎ ఒకరు వివరించారు.
ప్రత్యేక రాష్ట్రంపై తన వైఖరిని మార్చుకోవడంతో చంద్రబాబుపై తెలంగాణ ప్రజలకు అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు (కెసిఆర్) వంటి నాయకులు విమర్శనాస్త్రాలు సంధించడానికి కూడా ఇది ఊతం ఇచ్చింది. 'చంద్రబాబు నాయుడు 2004 వరకు సమైక్య ఆంధ్రకు అనుకూలంగానే ఉన్నారు. అప్పుడు ఆయన ఒక కమిటీ వేసి, దాదాపు రెండే పాటు తెలంగాణ అంశంపై తర్జనభర్జనలు సాగిస్తూనే ఉన్నారు. ఆ తరువాత టిడిపి తెలంగాణకు అనుకూలమేనని ప్రకటించారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం డిసెంబర్ 9న ఢిల్లీలో ప్రకటన చేసిన తరువాత కూడా తన పార్టీ తెలంగాణ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తుందని టిడిపి అధినేత తెలిపారు. కాని ఆ తరువాత 12 గంటలు కూడా గడవక ముందే ఆయన మాట మార్చారు. కేంద్రం నిర్ణయం తొందరపాటుతో కూడుకున్నదని, సంబంధిత వర్గాలు అన్నిటినీ సంప్రతించకుండా నిర్ణయం ప్రకటించిందని ఆయన అన్నారు' అని కెసిఆర్ గురువారం నిర్వహించిన మీడియా గోష్ఠిలో చెప్పారు.
పిఆర్పీ వైఖరిని మార్చుకున్నందుకు తెలంగాణ వాదుల నుంచి చిరంజీవి విమర్శలు ఎదుర్కొంటారు. కాని చంద్రబాబు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే జరిగే నష్టం ఆయనకే ఎక్కువ. 'రాజకీయ సంక్షోభం, ఈ అలజడి రానున్న కొన్ని రోజులలో ఏదో విధంగా సర్దుమణగాలని చంద్రబాబు ఆశించవచ్చు. అలా కాకపోతే టిడిపి పెద్ద కుదుపునకు గురి కావలసి ఉంటుంది' అని ఒక విశ్లేషకుడు సూచించడం గమనార్హం.
Pages: -1- 2 News Posted: 18 December, 2009
|