తుఫాను ముందు ప్రశాంతత
ఒక విధంగా చూస్తే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ విలక్షణమైనది కాగలదని, ఎస్సి, ఎస్టి, బిసిలు, మైనారిటీల సంకీర్ణం రాష్ట్రాన్ని పాలించగలదని ఇతరులు భావిస్తున్నారు. ఆదిలో సాధ్యం కాకపోవచ్చు కాని స్వల్ప కాలంలోనే కుల, వర్గ సమీకరణాలు బాగా మారిపోగలవని వారు భావిస్తున్నారు. 'తరతరాలుగా రాష్ట్రాన్ని పాలించిన రెడ్లు, వెలమలు మరింత వాస్తవిక పాత్రను అంగీకరించవలసి ఉంటుంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత వారి సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది' అని సింహాద్రి సూచించారు.
రాష్ట్ర సాంఘిక, రాజకీయ చరిత్ర ప్రవీణుడు భాంగ్య భూక్యా నాయక్ ప్రొఫెసర్ సింహాద్రి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. 'తెలంగాణ ప్రజలకు నాయకత్వ లక్షణాలు లేవని ఆంధ్ర రాజకీయ నాయకులలో ఒక వర్గం వారు భావిస్తున్నారు. ఇది అసంబద్ధమైనది. వలసవాద తత్వాన్ని ప్రతిబింబిస్తున్నది. మారుతున్న పరిస్థితులు మెరుగైన నాయకులను రంగంలోకి తీసుకువస్తాయి' అని నాయక్ అన్నారు.
'తెలంగాణ ప్రాంతం జనాభాలో 13 శాతం పైగా ఉన్న మైనారిటీలు కొత్త రాష్ట్రంలో సృజనాత్మకమైన, ప్రముఖమైన పాత్ర పోషించబోతున్నారు. ఎంఐఎం గాని, ముస్లింలలోనే మరేదైనా రాజకీయవర్గం గాని ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్ సిలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్ టిలు)తో చేతులు కలిపినట్లయితే, శాసనసభలో ఆ వర్గం ప్రతినిధుల సంఖ్య ఏ స్థాయికి పెరుగుతుందంటే వారి మద్దతు ఏ అధికార సంకీర్ణానికైనా కీలకం కాగలదు' అని సింహాద్రి, నాయక్ అభిప్రాయం వెలిబుచ్చారు.
అట్టడుగు వర్గాలు అంటే సమాజంలోని అణగారిన వర్గాలలో అలజడిని కెసిఆర్ గాని, ఆయన వంటివారు గాని అదుపు చేయలేరు. తెలంగాణ గోండులు, కోయలు, చెంచులు, లంబాడాలు వంటి తెగలు, వృత్తి పనివారు, సేవలు అందించే కులాలతో కూడుకున్న ప్రాంతం. విద్యార్థి నాయకులలో చాలా మంది ఈ వర్గాల నుంచి వచ్చినవారే. ఈ వర్గాలు అధికారం దక్కేంత వరకు ఈ ఉద్యమం సాగుతుంటుంది' అని న్యూఢిల్లీలో ఉంటున్న రాష్ట్ర వ్యవహారాల నిపుణుడు ఐ. తిరుమాలి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Pages: -1- 2 News Posted: 18 December, 2009
|