అద్వానీ వదలరు! 1996 ఎన్నికలకు ముందు అధికారం కోసం గట్టి ప్రయత్నం చేయవలసి ఉన్న తరుణంలో మాజీ ప్రధాని చంద్రశేఖర్ ప్రేరణతో సంఘ్ బిజెపి కనుక మెజారిటీ సాధించాలంటే మిత్ర పక్షాలను కూడగట్టుకోవలసి ఉంటుందని భావించింది. ఈ లక్ష్య సాధనకు అద్వానీ తగిన నేత కారని సంఘ్ నిర్ణయించింది. కాంగ్రెసేతర కూటమికి ఆమోదయోగ్యుడైన 'మధ్యస్థ' నేతగా వాజపేయిని సంఘ్ రంగంలో నిలబెట్టింది. వివిధ అంశాలపై నిర్దుష్ట వైఖరిని అనుసరించకుండా జాగ్రత్త పడే తన సామర్థ్యం ద్వారా వాజపేయి తనపై రాజకీయ ముద్ర ఏదీ పడకుండా చూసుకోగలిగారు. 'కరడుగట్టిన మతతత్వవాది'గా పరిగణన పొందిన అద్వానీ హుందాగా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపారు.
అయితే, వాజపేయి అదే హుందాతనం ప్రదర్శించలేదు. బిజెపి ఉత్థానంలో అద్వానీ పాత్రను వాజపేయి తన ధన్యవాదాల ప్రసంగంలో కనీసం ప్రస్తావించను కూడా లేదు.
అసలు వాజపేయి మనస్ఫూర్తిగా సంస్థ కార్యక్రమాలలో పాల్గొనలేదు. బహిరంగ సభలు, పార్లమెంట్ తో ఆయన హాయిగా గడుపుతున్నారు. అయితే, అద్వానీ పార్టీ బాధ్యతల నుంచి పార్లమెంటరీ బాధ్యతలకు తేలికగానే మళ్లారు. సంఘ్ తో ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయి. కాని తనకు రాజకీయంగా అనువుగా ఉంటుందని భావిస్తే తప్ప వాజపేయి సంఘ్ నాయకులను అంతగా పట్టించుకునేవారు కాదు.
అద్వానీ కార్యదక్షతకు అది ఒక్కటే కారణం కాదు. సరైన నేతల ఎంపిక బాధ్యతను చేపట్టిన అద్వానీ ఇతర పార్టీలకు అసూయ కలిగే విధంగా సమర్థులైన బృందాన్ని తయారు చేసుకున్నారు. ప్రమోద్ మహాజన్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, కె.ఎన్. గోవిందాచార్య, నరేంద్ర మోడి, ఉమాభారతి వంటి ప్రతిభావంతులను ఆయన ప్రోత్సహించారు.
అయితే, ప్రధాని కావాలనే ఆయన ఆంకాక్షను ప్రోది చేసింది ఆయన సన్నిహితులా లేక ఆయనకే ఆ కోరిక కలిగిందా అనేది ఇంకా తెలియదు. వాస్తవం ఏదైనప్పటికీ అది ఆయన రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది.
Pages: -1- 2 News Posted: 19 December, 2009
|