పంటలున్నా తిండి కొరత! మరీ దారుణమేమంటే సరిగ్గా 35 సంవత్సరాల క్రితం (1974 నవంబర్ లో) రోమ్ లో తొలి ప్రపంచ ఆహార సదస్సులో అప్పటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హెన్రీ కిసింజర్ పది సంవత్సరాలలో ప్రపంచంలో క్షుద్బాధను అంతం చేస్తామని వాగ్దానం చేశారు. ఇండియా, బంగ్లాదేశ్ లలో దుర్భిక్షం నెలకొనగా 'ఒక దశాబ్దంలోగా ఏ శిశువూ ఆకలితో నిద్రపోరాదు. ఏ కుటుంబమూ మరునాటి భోజనం ఎలా అని ఆందోళన చెందరాదు. ఏ మనిషి భవిష్యత్తుకు, సామర్థ్యానికీ పౌష్టికాహార లేమి వల్ల నష్టం వాటిల్లరాదు' అని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
జనాభా పెరుగుదలతో పాటు జంతువుల ప్రొటీన్ వాడకం పెరగడం, మోటారువాహనాల ఇంధనం కోసం ఆహార ధాన్యాల మళ్ళింపు కూడా ఈ డిమాండ్ ను వృద్ధి చేస్తున్నాయని వాషింగ్టన్ కేంద్రంగా గల ప్రముఖ మేధో సంస్థ ఎర్త్ పాలిసీ ఇన్ స్టిట్యూట్ కు చెందిన లెస్టర్ బ్రౌన్ చెప్పారు. 'సుమారు మూడు బిలియన్ల మంది ప్రజలు ఆహార పద్ధతులు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా జంతు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. అమెరికా, కెనడా దేశాలలో ప్రజలు ఏడాదికి సగటున 800 కిలోల ధాన్యాలను తింటుంటారు. వాటిలో ప్రధాన వాటా పశుమాంసం, పంది మాంసం, పౌల్ట్రీ, పాలు, గుడ్లదే. ఇండియాలో ప్రజలు సగటున 200 కిలోల కన్నా తక్కువగా ధాన్యాలు తింటుంటారు' అని బ్రౌన్ 'టిఒఐ-క్రెస్ట్' విలేఖరితో చెప్పారు.
అయితే, హఠాత్తుగా ప్రతి ఒక్కరూ విపరీతంగా పెరిగిపోయిన ఆహార ధరల గురించే మాట్లాడుతున్నారు. వాస్తవానికి అవి గత రెండు సంవత్సరాలుగా పెరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో గత రెండు సంవత్సరాలలో పెసరపప్పు రీటైల్ ధర 128 శాతం, కందిపప్పు ధర 112 శాతం, మినప్పప్పు ధర 105 శాతం, ఉల్లిపాయల ధర 110 శాతం, చక్కెర ధర 118 శాతం, బంగాళాదుంపల ధర 56 శాతం, బియ్యం ధర 44 శాతం, లూజ్ టీ ధర 43 శాతం, గోధుమ పిండి ధర 38 శాతం, గోధుమల ధర 25 శాతం మేర పెరిగాయి. గుడ్లు, మాంసం, పౌల్ట్రీ రేట్లు కూడా దారుణంగా పెరిగాయి. అప్పుడే ఏమయింది. పప్పులు, మొక్కజొన్న వంటి చాలా వ్యవసాయోత్పత్తుల విషయం ఫ్యూచర్స్ ట్రేడింగ్ ను అనుమతించడం లేదు. కాని వచ్చే కొన్నినెలలలో ఫ్యూచర్స్ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 19 December, 2009
|