'ఉద్యమం' ఉచిత మార్కులు? ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలను మూసివేయవలసి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుత విద్యార్థులు సాగిస్తున్న ఉద్యమాలు కాకుండా, తరచు బంద్ లకు పిలుపు ఇవ్వడాలు, వైఎస్ఆర్ దుర్మరణం వంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఇంకా స్వైన్ ఫ్లూ ముప్పు, వరదల కారణంగా కూడా పాఠశాలలను మూసివేశారు. జూలై, డిసెంబర్ మధ్య జరిగిన ఈ సంఘటనల పర్యవసానంగా పాఠశాలలను ఒక నెలకు పైగా మూసివేయవలసి వచ్చింది.
'ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అక్కడి అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహించి బడి రోజుల నష్టాన్ని భర్తీ చేశారు. కాని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో పరిస్థితి ఏమీ బాగుండలేదు. పరిస్థితి తమ చేతుల్లో లేదని, ఇప్పుడు కొంత హడావిడి పడినప్పటికీ సిలబస్ ను పూర్తి చేయడం సాధ్యం కాదని జిల్లాలలోని విద్యా శాఖాధికారుల నుంచి మాకు నివేదికలు అందాయి' అని ఉన్నత విద్యా శాఖ అధికారి ఒకరు తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 21 December, 2009
|