కామ్రేడ్ గడ్కరి! బిజెపి నియమావళిని జన సంఘ్ నియమావళికి దగ్గరగా ఉండేట్లుగా సవరించవలసిందని కూడా గడ్కరిని వైద్య కోరారు. సంస్థాగత, రాజకీయ లేదా శాసన విభాగాల మధ్య విభజన రేఖను జన సంఘ్ నియమావళి స్పష్టంగా సూచించింది. తమ పార్టీ నియమావళికి జన సంఘ్ నుంచి కాకుండా కాంగ్రెస్ నియమావళి నుంచి ప్రేరణ తీసుకున్నట్లు బిజెపి వర్గాలు తెలియజేశాయి.'ఆయన (వైద్య) అభిప్రాయాలు సంఘ్ వి కావాలనేమీ లేదు. కాని మా ఉన్నత స్థాయి నాయకులు వ్యక్తిగతంగా వాటిని ప్రతిబింబిస్తుంటారు. చివరకు నిర్ణయం తీసుకోవలసింది బిజెపియే' అని వైద్య కుమారుడు, సంఘ్ ప్రచార విభాగం అధిపతి మన్మోహన్ వైద్య పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, శాసన, సంస్థాగత విభాగాల మధ్య విభజన రేఖను సూచిస్తున్నట్లుగా సోమవారం నియామకాలు జరిగాయి. అద్వానీ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ ముండేని లోక్ సభలో బిజెపి పార్లమెంటరీ పార్టీ ఉప నాయకునిగా నియమించారు. మహారాష్ట్రకు చెందిన ముండే, గడ్కరి మధ్య చాలా కాలంగా స్పర్థలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుని బృందంలో ముండేకి చోటు దక్కుతుందని భావిస్తున్నవారు కొద్ది మందే. అయినప్పటికీ వెనుకబడిన తరగతి నేత అయిన ముండేని అలక్ష్యం చేయజాలరు. సంఘ్ ఆదేశం ఈ సందర్భంలో అక్కరకు వచ్చింది.
Pages: -1- 2 News Posted: 22 December, 2009
|