'దీక్ష' కు నిమ్స్ రక్ష లగడపాటి, ఆయన అనుచరులు ఇదేవిధమైన ఒత్తిడి వ్యూహాన్ని అనుసరించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయమేమంటే లగడపాటిని అర్ధరాత్రి దాటిన తరువాత విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఆయన కులాసాగా, ఉల్లాసంగా ఉన్నట్లు ఆయన అనుచరులే చెప్పడం. కాని కొన్ని గంటల తరువాత ఆయన ఆరోగ్యం బాగుండలేదని వారే ప్రకటించి ఆయనను నిమ్స్ కు తరలించాలని కోరారు.
గమనార్హమైన మరొక విషయమేమంటే వై.ఎస్. వివేకానందరెడ్డిని ఆయన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన ప్రముఖ రాజీవ్ గాంధి వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్)లో చేర్పించగా, ఆయన కూడా తనను నిమ్స్ కు తరలించాలని కోరడం.
వారి భయాన్ని సమర్థిస్తున్నట్లుగా ఈ ఆసుపత్రుల వైద్యులు కూడా తమ వద్ద సదుపాయాలు లోపించినట్లు సణగసాగారు. ఉదాహరణకు, రిమ్స్ ఇన్ చార్జి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తమ ఆసుపత్రిలో వైద్య పరికరాలు, తగిన అర్హతలు గల సిబ్బంది లేరని చెప్పారు. 'ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనలైజర్ పని చేయడం లేదు. దాని మరమ్మతుకు రూ. 6 లక్షలు అవసరం' అని ఆయన తెలియజేశారు.
విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్) కూడా తమ వద్ద కార్డియాలజిస్టులు, సెఫ్రాలజిస్టులు, సర్జన్లు లేరని వెల్లడించింది. విషమ పరిస్థితిలో ఉన్న రోగులకు చికిత్స చేసేందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కూడా తమ వద్ద లేదని ఆ ఆసుపత్రి తెలియజేసింది. 'నిధుల మంజూరు కోసం మేము చాలా కాలం క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కాని ప్రభుత్వం నుంచి స్పందనే రాలేదు' అని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పాలడుగు రాంబాబు తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 23 December, 2009
|