అందరిపై నిఘా నేత్రం నాట్ గ్రిడ్ ఏర్పడిన తరువాత పౌరులకు సంబంధించిన వివరాలు డాటా బేస్ మరింత పకడ్బందీగా రూపొందిస్తారు. వ్యక్తికి సంబంధించిన ప్రతీ వ్యవహారాన్ని, కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. ఎలాంటి సందేహం ఏర్పడినా వెంటనే దర్యాప్తులోకి దిగిపోతారు. తీవ్రవాదం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా ఇలాంటి ఏర్పాటు ఉండాలని అధికారు చెబుతున్నారు.
ఇలాంటి నిఘా వ్యవస్థ మనకు ఉన్నట్లయితే అమెరికా జాతీయుడైన పాకిస్తాన్ తీవ్రవాది హేడ్లీ భారతదేశంలో అంత స్వేచ్ఛగా మూడేళ్లపాటు సంచరించగలిగేవాడు కాదని నిఘా అధికారుల అభిప్రాయం. అతను భారత్ వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ వెళ్ళాడు. వ్యాపారి కానప్పటికీ భారత్ లో విదేశీ మారక ద్రవ్యాన్ని రూపాయలుగా మార్చగలిగాడు. నాట్ గ్రిడ్ ఉంటే ఇవన్ని నిఘా విభాగాల దృష్టిలో సులభంగా పడేవని వారు వివరిస్తున్నారు.
కాగా ప్రైవేట్ రంగంలో భద్రాతా నిపుణుడుగా ప్రసిద్ధిగాంచిన రఘు మీనన్ ను నాట్ గ్రిడ్ సిఇవో గా చిదంబరం నియమించారు. మీనన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పర్యవేక్షణలోనే నాట్ గ్రిడ్ రూపకల్పన శరవేగంగా సాగుతోంది.
Pages: -1- 2 News Posted: 23 December, 2009
|