తివారీ రాసలీలలు? కడప జిల్లా గనుల అనుమతి విషయంలో తివారి మాటతప్పడం, ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వడానికి అరవింద్ శర్మ తిరస్కరించడం, తరువాత గవర్నర్ దగ్గరుకు వెళ్ళిన అమ్మాయిలను వేధించడం తదితర పరిణామాలతో ఆ మహిళకు తివారికి వ్యవహారం చెడింది. దాంతో ఆమె తమను ఆశ్రయించి, అమ్మాయిల సహకారంతో విడియోలు, ఫోటోలు, సాక్ష్యధారలతో సహా తివారి వికృత చేష్టలను బయటపెట్టిందని చానల్ యాజమాన్యం పేర్కొంది. ఆ మహిళ చెప్పిన సంగతులు గుండెల్ని బద్దలు చేసేవిగా ఉన్నాయని వివరించింది. రాజ్ భవన్ కు వచ్చిన అమ్మాయిలను కొంతమంది ఎంపీలు కూడా బ్లాక్ మెయిల్ చేసి లోబరుచుకున్నారని కథనంలో పేర్కొంది.
ఈ కథనాన్ని ప్రసారం చేస్తామని చానల్ యాజమాన్యం తమ పత్రిక పతాక శీర్షికలోనే ప్రచురించింది. దీనిని చూసిన గవర్నర్ కార్యాలయ అధికారులు ప్రసారాన్ని అడ్డుకోవాల్సిందిగా కోరుతూ న్యాయవాదితో హై కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసారు. పత్రికను తెప్పిచుకుని చూసిన న్యాయమూర్తులు ప్రసారాలను నిలిపివేయవలసిందిగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదిలా ఉంటే మహిళలతో తివారి వివాహేతర సంబంధాలపై వివాదాలు రావడం కొత్తేమీ కాదు. మొన్నటికి మొన్న రోహిత్ అనే 20 సంవత్సరాల యువకుడు తన తండ్రి నారాయణ్ దత్ తివారియేనని, ఆయన తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో కేసు వేశారు. కాంగ్రెస్ నాయకురాలిగా పనిచేసిన తన తల్లితో తివారి సంబంధాలు నెరిపారని ఆయన వాదించారు. కానీ పితృత్యాన్ని కోరడానికి నిర్ణీత గడువు దాటిపోయిందనే కారణంతో ఈ కేసు వీగిపోయింది. తివారి పితృత్వ తగవు నుంచి బయటపడ్డారు. రెండుసార్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరాంచల్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన తివారి ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితులయ్యారు. వయస్సులో పెద్దవాడిగా రాష్ట్ర నాయకుల గౌరవాలను ఆయన అందుకుంటున్నారు. కానీ ఒక పక్క రాష్ట్రం తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి, ప్రజాజీవితం అల్లకల్లోలంగా సాగుతున్న తరుణంలో గవర్నరు తివారి రాజ్ భవన్ లో రాసలీలల్లో మునిగి తేలుతున్నారన్న సమాచారం విస్మయానికి గురిచేసింది. తన గవర్నరు పదవి ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకుని అమ్మాయిలను బలవంతంగా లొంగదీసుకున్నారన్న కథనంతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. కాగా ఈ కథనం నేపథ్యంలో రాజ్ భవన వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Pages: -1- 2 News Posted: 25 December, 2009
|