తెలంగాణపై డోలాయమానం
సుప్రీం కోర్టులో లేదా హైకోర్టులో రిటైరైన న్యాయమూర్తి ఒకరు కమిషన్ కు సారథ్యం వహిస్తారు. కమిషన్ లో కొందరు సభ్యులు కూడా ఉంటారు. కమిషన్ కనుక ఏర్పాటైతే, ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేదా వ్యతిరేంగా వివిధ వర్గాల నుంచి అభ్యర్థనలు, అభిప్రాయాలను అది పరిశీలించవలసి ఉంటుంది. అంతే కాకుండా, ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్లు వస్తున్న ప్రాంతాలను ఎస్ఆర్ సి సభ్యులు సందర్శించవలసి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ (టిడిపి) నాయకుడు డాక్టర్ నాగం జనార్దన రెడ్డిపై దౌర్జన్యం జరగడంతోను, ఇంకా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతోను గురువారం తెలంగాణ ప్రాంతంలో పరిస్థితి విషమ రూపు దాల్చడం వల్ల ఈ ప్రక్రియను కేంద్రం వేగిరపరచవలసి రావచ్చు. పైగా, రాష్ట్ర క్రీడలు, ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణలో సంక్షోభం మొదలైన తరువాత రాజీనామా చేసిన తొలి మంత్రి కోమటిరెడ్డి. దీనితో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా రాజీనామా లేఖలు సమర్పించవచ్చు.
పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు నుంచి అదనపు బలగాలను అధిక సంఖ్యలో తరలించవలసిందిగా కోరుతూ చిదంబరానికి ముఖ్యమంత్రి ఒక లేఖ పంపారు. స్థానిక పోలీసులు ఇరకాట స్థితిని ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి తన లేఖలో ప్రస్తావించారని, వారి చిత్తశుద్ధిని తెలంగాణ అనుకూల, వ్యతిరేక కార్యకర్తలు అనుమానిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
కేంద్రం రాష్ట్రానికి దాదాపు 4000 మంది సిఆర్ పిఎఫ్ సిబ్బందిని విమానాలలో పంపుతున్నదని సమాచారం. తమిళనాడు నుంచి అదనపు బలగాలు రాష్ట్రానికి బయలుదేరినట్లు కూడా తెలుస్తున్నది. తమిళనాడు పోలీస్ శాఖ ఐదు కంపెనీల తమిళనాడు స్పెషల్ పోలీస్ (టిఎన్ఎస్ పి) సిబ్బందిని రాష్ట్రానికి పంపినట్లు చెన్నైలో పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజిపి) కె. రాధాకృష్ణన్ తెలియజేశారు.
గణనీయ సంఖ్యలో పారా మిలిటరీ బలగాలు రాష్ట్రానికి వస్తున్నాయని, వారిని హైదరాబాద్ నగరంలోను, తెలంగాణ ప్రాంతంలోని ఇతర సున్నిత ప్రాంతాలలోను నియోగించగలమని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి, ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐజి) ఎ.ఆర్. అనూరాధ చెప్పారు. తమ పిల్లలు కనుక ఒయు కాంపస్ లో అల్లర్లు సృష్టిస్తూనే ఉంటే పరిస్థితి అదుపు తప్పిపోవచ్చునని తల్లిదండ్రులను అనూరాధ హెచ్చరించారు.
Pages: -1- 2 News Posted: 25 December, 2009
|