విదేశీ వర్శిటీలకు షాక్ ఏదైనా విదేశీ విద్యా సంస్థ మూతపడితే ఆ సంస్థలో చేరిన విద్యార్థులకు ప్రత్యామ్నాయ, సముచిత విద్యా సౌకర్యాలు లభించేట్లు చూడడం ప్రభుత్వ కర్తవ్యమని బిల్లు స్పష్టం చేస్తున్నది. విశ్వసనీయత లేని విద్యా సంస్థల నిర్వాహకుల బారి నుంచి విద్యార్థులను రక్షించడానికి ఈ క్లాజును, కార్పస్ నిధిని ఉద్దేశించారు.కార్పస్ నిధిలో ప్రిన్సిపాల్ సొమ్మును విద్యా సంస్థ తాకజాలదు. ప్రిన్సిపాల్ సొమ్ముపై వచ్చే వడ్డీలో 75 శాతాన్ని తిరిగి సంస్థపై మదుపు పెట్టవచ్చునని, మిగిలిన 25 శాతాన్ని కార్పస్ నిధికి కలపాలని బిల్లు సూచిస్తున్నది.
చిక్కులో పడిన చందాదారులకు ఈ సంస్థ తన ప్రకటనలో ఒక సూచన చేసింది. 'మీ చందా కాంట్రాక్టు యుఎస్ లో దివాలా ప్రక్రియలో ఉన్న యుఎస్ కంపెనీ వరల్డ్ స్పేస్ ఇన్ కార్పొరేషన్ తో కుదుర్చుకున్నట్టిది. మూసివేత తేదీ తరువాత సమయానికి కూడా సర్వీసుల కోసం మీరు చెల్లింపులు జరిపి ఉండవచ్చునని సంస్థ గుర్తించింది. అయితే, మీ చందాలో వాడుకోని భాగానికి డబ్బు వాపసు పంపే స్థితిలో సంస్థ లేదు' అని సంస్థ పేర్కొన్నది.
ఈ సంస్థ నిర్ణయానికి సుమారు నాలుగున్నర లక్షల మంది చందాదారులు అగమ్యగోచర స్థితిలో పడ్డారు. వారిలో కొందరు కేవలం రెండు నెలల క్రితం సంస్థతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. 'మీకు యుఎస్ దివాలా చట్టం కింద పరిష్కారం లభించవచ్చు. దివాలా సంస్థ రుణదాతల పరిరక్షణకు ఉద్దేశించిన ప్రక్రియ కింద మీరు క్లెయిము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే సంవత్సరం ఆరంభంలో ఒక క్లెయిము సర్వీస్ కంపెనీ సంస్థ జాబితాలో గల రుణదాతలందరికీ నోటీసు పంపగలదు' అని అటువంటి చందాదారులకు సంస్థ సూచించింది.
Pages: -1- 2 News Posted: 26 December, 2009
|