నేతల నైతిక 'హద్దులు'
కాంగ్రెస్ పార్టీకి చెందిన శక్తిమంతుడైన సమాచార, ప్రసార శాఖ మంత్రికి ఆయన పేరులో కొంత భాగం తన పేరులోను ఉన్న ఒక నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుసగుసలు ఎక్కువగానే వినిపించేవి. తాము విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలకు ఆ నటి ఆయనపై ఆరోపణలు కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి వంటి కొన్ని పదవులు నిర్వహించిన ఒక మాజీ కాంగ్రెస్ ప్రముఖుడు అనుచితంగా ప్రవర్తించేవారని ఆరోపణ వస్తుండేది. ఆ నాయకుడు తన భార్య అంత్యక్రియలకు తన స్నేహితురాలితో కలసి హాజరైనప్పుడు ఇందిరా గాంధి అమితాగ్రహం చెందారని కాంగ్రెస్ పార్టీలో ఊహాగానాలు సాగాయి కూడా.
ఇక మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు మంత్రివర్గంలో ఒక సభ్యుడు బొమ్మలు, తాళ్ళు, స్పానిష్ ఫ్లై, సెక్స్ బొమ్మలు వంటి వస్తువులతో విదేశాల నుంచి తిరిగివస్తూ కనిపించినట్లు సమాచారం. థాయిలాండ్ పర్యటనకు వెళ్ళిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఒక మసాజ్ పార్లర్ లోకి వెళ్ళి తన వద్ద గల థాయి కరెన్సీ బహత్ లు అన్నీ ఖర్చు చేసినప్పుడు బ్యాంకాక్ లోని భారత రాయబార కార్యాలయం ఆయనను 'ఆదుకున్నద'ని గుసగుసలు వినిపించాయి. అంతర్జాతీయ నేత ఒకరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం ఆ రాజకీయ నాయకుడు తిరిగి వస్తుండగా ఈ ఉదంతం చోటు చేసుకుంది.
ఇక అందరి దృష్టికీ రానివి ఎన్నో ఉన్నాయి. ఒక గవర్నర్ గారు రోజూ రాజ్ భవన్ లో అసాధారణ స్థాయిలో భారీ పరిమాణంలో తేనె కోసం ఆర్డర్ ఇస్తుండేవారని కథనాలు వినవచ్చేవి. తన పార్టీ సహచరులు కొందరి అనైతిక ప్రవర్తన గురించిన కథలతో ఇందిరా గాంధికి ఎప్పుడూ లేఖలు అందుతుండేవని ఆ కాలపు నాయకులు గుర్తు చేస్తున్నారు. ఆకాశరామన్న ఫిర్యాదులను అప్పటి ప్రధాని ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. కాని కుటుంబ సభ్యులలో ఎవరి దగ్గర నుంచైనా అభ్యంతరం వస్తే మాత్రం ఆమె సదరు పార్టీ నాయకుని పిలిపిస్తుండేవారు.
ఇక ఆమె కుమారుడు రాజీవ్ గాంధి నవ్వుతూ ఇటువంటి సమాచారాన్ని బేఖాతరు చేస్తుండేవారని ప్రతీతి. కాని సోనియా గాంధి 'బహిరంగం బహిరంగమే, ఆంతరంగికం ఆంతరంగికమే' అనే సూత్రాన్ని పాటిస్తుంటారని వినికిడి.
Pages: -1- 2 News Posted: 28 December, 2009
|