విద్యార్ధికి ఎంత నష్టం!?
ఎంఎస్ సి చివరి సంవత్సరం విద్యార్థి శ్రీనివాస రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'మా చివరి సంవత్సరం తరువాత నేను పరిశోధన చేయాలని ఆలోచిస్తున్నాను. మా చివరి సెమిస్టర్ లోదాదాపు నాలుగు నెలలపాటు క్లాసులు, లేబరేటరీ పని ఉంటుంది. మేము సకాలంలో మా డిగ్రీలు పొందకపోతే మా కెరీర్ లక్ష్యాలే దెబ్బ తింటాయి' అని అతను అన్నాడు. 'విదేశాలలో చదవడానికి మాకు సిఫార్సు లేఖలు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అవసరం. మేము ఇప్పుడు దరఖాస్తు చేయలేకపోతే ఆరు నెలలు నష్టపోతాం' అని విఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థి బి. అశోక్ చెప్పాడు. 'ప్రిపరేటరీ సెలవులు ఉండే రెండు వారాలలోను, వేసవి సెలవులలోను క్లాసులు నిర్వహించడానికి ఓవర్ టైమ్ పని చేసేందుకు మాకేమీ అభ్యంతరం లేదు. అయితే,ఆందోళన పథంలో ఉన్న విద్యార్థులు సహకరించాలి' అని ప్రొఫెసర్ సుదర్శనరావు అన్నారు.
అయితే, మరింత కలవరపరుస్తున్న విషయమేమంటే ఆందోళన పథంలో ఉన్న విద్యార్థులు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కోసం ఈ విద్యా సంవత్సరాన్ని 'వదలుకోవడానికి' సిద్ధంగా ఉండడం. వారు దీనిని 'తెలంగాణ సాధన సంవత్సరం'గా పేర్కొంటున్నారు. 'నిరసనలు వ్యక్తం చేస్తుండండి, అయితే క్లాసులకూ హాజరవుతుండండి అని విద్యార్థులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే రెండు రోజులలో తరగతులు ప్రారంభం కాని పక్షంలో వేలాది మంది విద్యార్థులు ఈ సంవత్సరం సకాలంలో తమ డిగ్రీలను పొందలేకపోవచ్చు' అని ఒయు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుదర్శనరావు పేర్కొన్నారు.
జెఎన్ టియుకు అనుబంధితమైన 300 ఇంజనీరింగ్ కళాశాలలు, 98 ఎంబిఎ విద్యా సంస్థల విద్యార్థులు ఈ విష వలయంలో చిక్కుకున్నారు. తన రెండవ సెమిస్టర్ ను ఇప్పటికే ప్రారంభించి ఉండవలసిన విశ్వవిద్యాలయం తన మొదటి సెమిస్టర్ పరీక్షలనే ఇంకా పూర్తి చేయలేకపోయింది. ఈ విద్యా సంవత్సరాన్ని కాపాడే అవకాశాలు తక్కువేనని జెఎన్ టియు రెక్టార్ ప్రొఫెసర్ లాల్ కిషోర్ సూచించారు. 'మేము 40 పని రోజులు నష్టపోయాం. ఉద్యోగాల కోసం చూసే చివరి సంవత్సరం విద్యార్థుల అవకాశాలను ఇది దెబ్బ తీయగలదు' అని ఆయన అన్నారు.
Pages: -1- 2 News Posted: 29 December, 2009
|