ప్రేమఖైదులో నక్సల్ రాయగడ జిల్లా గుడారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గులుండా గ్రామానికి చెందిన ఆ యువతి 2006లో సిపిఐ (మావోయిస్టు) పార్టీలో చేరింది. ఆమె జంగుడి దళం ఏరియా కమిటీ సభ్యురాలు. ఆమెను ఈ నిషిద్ధ సంస్థలోకి మావోయిస్టు నాయకుడు ఉదయ్ చేర్పించాడు. 2008 ఆగస్టు 23 రాత్రి స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్యలో ప్రమేయం ఉన్నందుకు అతను ఇప్పుడు జైలులో ఉన్నాడు.
2008 ఫిబ్రవరి 15న నయాగఢ్ పట్టణంలోని ఆయుధాగారం లూటీలో తాను పాల్గొన్నట్లు సునీత అంగీకరించింది. రాయగడ, గజపతి జిల్లాలలో జరిగిన డజను నేరాలలో నిందితురాలైన ఆమె కోసం ఇంతకాలం తాము గాలిస్తున్నట్లు రాయగడ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ పి) ఆశిష్ కుమార్ సింగ్ తెలియజేశారు. తమ ముందు లొంగిపోయిన మూడవ క్రియాశీలక మావోయిస్టు రెబెల్ అయిన సునీతకు తగిన భద్రత కల్పించగలమని సింగ్ తెలిపారు.
జూన్ 8న మావోయిస్ట్ ఆకాశ్ అలియాస్ ఘాసీరామ్ మాఝి తన సీనియర్ల దురుసు ప్రవర్తనకు విసుగు చెంది తన భార్య ఝరణతో కలసి పోలీసుల ముందు లొంగిపోయాడు. సిపిఐ (మావోయిస్ట్) వంశధార డివిజన్ సభ్యులైన సురేంద్ర బ్రెకెడ్డ (20), భార్య జయ రుప్పి (19) జూలై 22న పోలీసుల ముందు లొంగిపోయారు.
Pages: -1- 2 News Posted: 31 December, 2009
|