పురంధేశ్వరిదే లక్కు వాణిజ్య రంగంలో 2010లో విశిష్ట స్థానం పొందగల వ్యక్తి జిఎంఆర్ గ్రూపు చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు. ఆ సంస్థను (1991) మే 10న నెలకొల్పారు. జిఎంఆర్ పేరు 9ని సూచిస్తుంది. అది 1 అంకెకు మిత్ర సంఖ్య. చైర్మన్ పేరులో అక్షరాలు మొత్తం కలిపితే 6 వస్తుంది. అది మరొక మిత్ర సంఖ్య. అందువల్ల జిఎంఆర్ స్థితి 2010లో మెరుగ్గా ఉంటుంది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం, సూర్యుడు అంటే 'రాజు' లేదా 'పాలకుడు'. ప్రజాస్వామ్య దేశాల పరంగా చూస్తే సూర్యుడు అంటే ప్రభుత్వం. 2001 సంవత్సరం సూర్య సంవత్సరం. ఇది పదవ సంవత్సరం. అందువల్ల దీనికి పదింతల శక్తి ఉంటుంది. జన్మ తేదీలు 1, 4, 10, 13, 19, 22, 28 అయిన, జన్మ మాసాలు జనవరి, ఏప్రిల్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిన వ్యక్తులకు 2010 సంవత్సరం అదృష్టం తీసుకువచ్చేది కాగలదు.
10 అంకెకు గల సత్ప్రభావం వల్ల, ప్రజలు ప్రభుత్వ ప్రాజెక్టులు, ఆదరణ, పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ అధికారాలు వంటి రంగాలలోను, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాలలోను విజయం సాధించగలరు. వారందరికీ 2009లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు 2010లో కార్యరూపం దాల్చగలవు. 10 అంకె ప్రధాన లక్షణాలు ఆరోగ్యం, పాలన ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ తమ అధికారాలను పటిష్ఠం చేసుకోగలవు. అవి ఎటువంటి సమస్యనైనా అధిగమించగలవు. బలిష్ఠమైన పాలనా యంత్రాంగాన్ని నడపగలవు, ఎంతో సాహసంతో కొత్త విప్లవాత్మక కార్యక్రమాలను అమలుపరచగలవు. ఇక ఆరోగ్య రంగానికి సంబంధించి, కొన్ని ఫైవ్ స్టార్ ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ సంస్థలు తమ ఆర్థిక వనరులను మెరుగుపరచుకోగలవు. అవి మంచి వృద్ధిని సాధించగలవు. కొత్త ఆరోగ్య ఉత్పత్తులు, పరికరాలు రూపుదిద్దుకోగలవు.
Pages: -1- 2 News Posted: 1 January, 2010
|