'సింహ' స్వప్నం 'కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం ఒక లక్ష్యంతోనే నరసింహన్ ను పంపింది. ఇంటలిజెన్స్ బ్యూరో మాజీ అధిపతిగా తనకు గల అనుభవంతో ముందుగా రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించవలసిందిగా ఆయనకు స్పష్టం చేశారు. ప్రాంతాలవారీగా చీలిపోయిన రోశయ్య ప్రభుత్వం ఇంతవరకు ఆ పని చేయలేకపోయింది కదా' అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, గవర్నర్ తీరు పట్ల చిరాకు పడుతున్నది తెలంగాణ నాయకులు మాత్రమే కాదు. 'ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ కూడా. చాన్సలర్ టి. తిరుపతిరావు కూడా గవర్నర్ ను కలుసుకున్నారు. తెలంగాణ కోసం ఆందోళన సాగిస్తున్న విద్యార్థులను అదుపు చేయడానికి క్యాంపస్ లోకి పోలీసులను ప్రవేశించనివ్వనందుకు ఆయనను నరసింహన్ నిలదీశారు. క్యాంపస్ లోకి పోలీసులు ప్రవేశించకుండా ఆపడానికి మీరెవ్వరని విసితో గవర్నర్ అన్నారు' అని వారిద్దరి సమావేశం వివరాలు తెలిసిన ప్రతినిధులు చెప్పారు.
1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న సీనియర్ నాయకుడు ఒకరు గవర్నర్ ను కలుసుకున్నప్పుడు ఆనాటి ఉద్యమంలో పాల్గొన్న వారంత దూకుడు స్వభావంతో ఇప్పటి విద్యార్థులు లేరని ఆయనతో చెప్పారు. 'వారు శాంతియుతంగా వ్యవహరించారు. ఎటువంటి దౌర్జన్య సంఘటనలకూ పాల్పడలేదు. అయినప్పటికీ వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు' అని ఆ నాయకుడు గవర్నర్ తో చెప్పినట్లు తెలుస్తున్నది.
గవర్నర్ క్రియాశీలక పాత్ర పోషిస్తుండడం ఇప్పటికే విమర్శలకు దారి తీసింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపి కె. కేశవరావు ఇందుకు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. 'రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పటిష్ఠత కోసం గవర్నర్ కృషి చేయాలి. కాని తానే రాష్ట్రాన్ని పాలిస్తున్నాననే అభిప్రాయాన్ని నరసింహన్ కలిగిస్తున్నారు. దురదృష్టవశాత్తు రోశయ్య కూడా ప్రతి ఒక్కరినీ గవర్నర్ ను కలుసుకోవలసిందని పంపుతూ ఆ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నారు. 'ఎన్నికైన ప్రభుత్వాన్ని పటిష్ఠం చేయడంలో సిఎంకు చేయూత ఇవ్వండి. మీరు కావాలనుకుంటే ఆయనకు సలహాలు ఇవ్వండి' అనేదే నరసింహన్ కు నా సలహా' అని కేశవరావు శుక్రవారం మీడియాతో చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరతను పరిగణనలోకి తీసుకుంటే, నరసింహన్ హైదరాబాద్ కు రావడం, ఆయన వ్యవహరణ తీరు పరిస్థితిని సర్దుబాటు చేయడం కన్నా మరింత సంక్లిష్టం చేస్తున్నదనే అభిప్రాయం కలుగుతున్నది. 'ప్రస్తుతం ఆనందంగా ఉన్నది పోలీసులు మాత్రమే. తమలో ఒకరు పగ్గాలు చేపట్టారని వారు భావిస్తున్నారు' అని ఒక ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 2 January, 2010
|