డాక్టర్లకు గిఫ్ట్ లు బంద్ ఎంసిఐ నిబంధనావళి ప్రకారం, ఫార్మాస్యూటికల్, అనుబంధ ఆరోగ్య రక్షణ పరిశ్రమలు ఆర్థిక సహాయం చేసే పరిశోధన ప్రాజెక్టులలో వైద్యుడు పాల్గొనవచ్చు లేదా పని చేయవచ్చు. కాని తగిన అధికారుల నుంచి సదరు ప్రాజెక్టుకు అనుమతి లభించేట్లు చూసుకోవాలి. సంస్థాగతమైన నైతిక విభాగం నుంచి పరిశోధన ప్రాజెక్టుకు అనుమతి లభించేట్లు కూడా వైద్యుడు చూసుకోవాలి.
ఔషధ సంస్థలు డాక్టర్లకు ప్రయోజనాలు సమకూర్చడంపై ఎంసిఐ కోడ్ ను రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి స్వాగతిస్తూ, 'ఔషధ సంస్థలు సరసమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను మాకు ఇస్తే కానుకలు స్వీకరించవలసిన బాధ్యత ఏమీ లేదు. మందుల నాణ్యమైనవి, చక్కగా పని చేసేవి అయినట్లయితే డాక్టర్లు వాటినే సూచిస్తారు' అని తెలిపారు. అయితే, 'ఔషధ సంస్థలతో వృత్తిపరమైన సంబంధాన్ని కొనసాగించడం ప్రధానం' అనే అభిప్రాయాన్ని డాక్టర్ శ్రీనివాస్ వ్యక్తం చేశారు.
ఏదో గుర్తుగా ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ లు, పెన్నులు వంటి చిన్న కానుకలు స్వీకరించడంలో తప్పు లేదని ఉస్మానియా వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. మన్మోహన్ వాదించారు. 'అయితే, అత్యంత ఖరీదైన కానుకలను మాత్రం డాక్టర్లు తిరస్కరించాలి' అని ఆయన అన్నారు.
'ఔషధ, అనుబంధ ఆరోగ్య రక్షణ పరిశ్రమలతో వ్యవహరించేటప్పుడు వైద్యుడు వృత్తిపరమైన తన స్వతంత్ర ప్రతిపత్తికి గాని, తాను పని చేస్తున్న వైద్య సంస్థ స్వతంత్ర ప్రతిపత్తికి, స్వేచ్ఛకు గాని భంగం కలగకుండా జాగ్రత్త పడాలి' అని కూడా ఎంసిఐ మార్గదర్శక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 2 January, 2010
|