కులాల లెక్కలు తీస్తారా? 'చివరిసారిగా కులం ప్రస్తావనతో జనాభా లెక్కల సేకరణ జరిగిన తరువాత గడచిన ఎనిమిది దశాబ్దాలలో కులాల సమీకరణలు, స్థితిగతులలో చెప్పుకోదగిన మార్పులు సంభవించాయి. కూర్పులకు, తొలగింపులకు అవకాశాలు ఉన్నాయి. అయితే, మాకు కచ్చితమైన డేటా ఉంటేనే ఈ విషయం స్పష్టం కాగలదు' అని ఆ అధికారి వివరించారు. 'ప్రభుత్వం వద్ద కులం ప్రాతిపదికగా పలు సంక్షేమ పథకాలు ఉన్నాయి. వివిధ కులాల జనాభా ఎంతో కచ్చితంగా తెలియకుండా ప్రభుత్వం తన పథకాలకు ఎలా ప్లాన్ చేస్తుంది' అని ఆయన అన్నారు.
వెనుకబడిన తరగతుల జనాభా, దారిద్ర్య రేఖకు దిగువన (బిపిఎల్) ఉన్నవారి సంఖ్య గురించి ప్రభుత్వం వద్ద విశ్వసనీయమైన డేటా లేదని సాంఘిక న్యాయ మంత్రిత్వశాఖకు అనుబంధితమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఆ అధికారి తెలిపారు. జనతా దళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ వంటి పలు రాజకీయ పార్టీలు కులాల సర్వేలు నిర్వహించాలని కోరుతున్నాయి. కాని వివాదం రేగవచ్చుననే భయంతో కేంద్రం అందుకు స్పందించలేదు. 'ప్రత్యేకంగా కులాల ప్రాతిపదికపై సర్వే జరపాలని మేము కోరడం లేదు. కాని యోగ్యతల జాబితాలో చేర్చడం కోసమే కులం ప్రస్తావనను కోరుతున్నాం. ఇందులో వివాదానికి ఎటువంటి ఆస్కారమూ లేదు' అని ఆ అధికారి పేర్కొన్నారు.
ప్రతి పదేళ్ళకు జరిపే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు వయస్సు, సెక్స్, షెడ్యూల్డ్ కులం/షెడ్యూల్డ్ తెగ హోదా, అక్షరాస్యత, మతం, మాతృ భాష లేదా తెలిసిన భాషలు, ఆర్థిక, వలస ప్రతిపత్తి వంటి సాంఘిక, ఆర్థిక అంశాలే ప్రాతిపదిక అవుతున్నాయి. కులం ప్రాతిపదికగా జనాభా లెక్కల సేకరణ జరపడం దీర్ఘకాలంలో కులాల నిర్మూలనకు దారి తీయగలదని సాంఘిక న్యాయ శాఖ మాజీ కార్యదర్శి పి.ఎస్. కృష్ణన్ అభిప్రాయం వెలిబుచ్చారు. 'కులాల సెన్సస్ వల్ల కులాలకు తిరిగి బలం చేకూర్చినట్లు కాగలదనం తప్పు. అందరికీ సమానావశం లభించడం వల్ల చివరకు కులాల నిర్మూలన జరగగలదు' అని కృష్ణన్ అన్నారు. ఆయన ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు సలహాదారుగా ఉన్నారు.
మండల్ నివేదిక రూపశిల్పి బి.పి. మండ్ ఎంపిగా ఉన్నసమయంలో కులం ప్రాతిపదికగా జనాభా లెక్కల సేకరణ జరపాలని 1978, 1980 మధ్య కాలంలో ముగ్గురు హోమ్ శాఖ మంత్రులు హెచ్.ఎం. పటేల్, వై.బి. చవాన్, జ్ఞాని జేల్ సింగ్ లకు విజ్ఞప్తి చేసినట్లు కృష్ణన్ తెలియజేశారు. తదుపరి జనాభా లెక్కల సేకరణ 2011 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరుగుతుంది. దీనికి మార్చి 1న 'రెఫరెన్స్' తేదీగా పరిగణిస్తారు.
Pages: -1- 2 News Posted: 4 January, 2010
|