ఇది అనర్థాల గ్రహణం మకర రాశి వారు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని, అప్పుల గురించి జాగ్రత్త పడాలని, కుంభరాశి వారు తమ ఖర్చులు, పిల్లలను ఒక కంట కనిపెట్టి ఉండాలని ఆయన సూచిస్తున్నారు. తులా రాశివారైతే చాలా విషయాలలో జాగ్రత్త పడాలి. వారు ఆరోగ్యం, ఉద్యోగం, వాహనం, తల్లిదండ్రుల గురించి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మిథున రాశివారు తమ ఆరోగ్యం, ప్రయాణాల గురించి జాగ్రత్త పడాలి. అయినప్పటికీ, ఈ నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించుకునేందుకై వారు సూర్య, శని రాహువులకు పరిహార శాంతి చేయించవలసి ఉంటుందని జ్యోతిష్కులు సలహా ఇస్తున్నారు. ఆ రాశులవారు అలా చేయలేని పక్షంలో కనీసం తమ జేబులో దర్భ ముక్కను ఉంచుకోవాలి. దాన ధర్మాలు చేయడం, మంత్రోచ్చారణ, జపాలు చేయడం అత్యుత్తమ పరిష్కార మార్గమని సుబ్రహ్మణ్యం అంటున్నారు.
వితంతువులు తల స్నానం చేయడం, ముత్తైదువలు అలా చేయకపోవడం, గ్రహణానికి మూడు గంటల ముందు, మూడు గంటల తరువాత ఆహారం తీసుకోకపోవడం, గర్భిణులు ఇళ్లలోనే ఉండిపోవడం వంటి మతపరమైన నిర్దేశాలు కూడా ఉన్నాయి. అయితే, బిఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్ బి.జి. సిద్ధార్థ ఇదంతా వఠ్ఠిదేనని అంటున్నారు. గ్రహణాలు దుష్ప్రభావం చూపుతాయని నిరూపించేందుకు శాస్త్రీయ విశ్లేషణ ఏదీ లేదని, జనం ఈ భయాన్ని వీడి ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించి ఆనందించాలని ఆయన అంటున్నారు.
ఈ సూర్య గ్రహణ వేళలు (భారత కాలమానం ప్రకారం)
నగరం మొదలు ముగింపు వ్యవధి
హైదరాబాద్ ఉ 11.29 మ 3.15 3.56 గం
విజయవాడ ఉ 11.33 మ 3.18 3.45 గం
వైజాగ్ ఉ 11.44 మ 3.22 3.38 గం
తిరుపతి ఉ 11.23 మ 3.14 3.51 గం
శ్రీశైలం ఉ 11.27 మ 3.15 3.48 గం
భద్రాచలం ఉ 11.37 మ 3.19 3.44 గం
శిరిడీ ఉ 11.23 మ 3.08 3.45 గం
పూరి ఉ 11.55 మ 3.26 3.31 గం
బాసర ఉ 11.34 మ 3.16 3.42 గం
Pages: -1- 2 News Posted: 6 January, 2010
|