ప్రజాతీర్పుతోనే విభజన కొన్ని వారాలుగా సాగుతున్న ఉద్యమం, హింసాయుత సంఘటనలు రాష్ట్రంపైన, హైదరాబాద్ నగరంపైన ఇప్పటికే వ్యతిరేక ప్రభావాన్ని చూపాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటున్న కంపెనీలు ప్రత్యామ్నాయ ప్రదేశాల కోసం చూస్తున్నాయి. ఇప్పుడు ఉన్న, రాబోయే ఉద్యోగాలు హైదరాబాద్ నుంచి తరలిపోతున్నాయి. ముఖ్యమైన ఉత్సవాలు వంటి కార్యక్రమాలు రద్దవుతున్నాయి. భారతీయ పరిశ్రమల బృహత్ సమాఖ్యం (సిఐఐ) తన భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సును హైదరాబాద్ నుంచి చెన్నైకి మార్చుకున్నది. ఇది హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు నష్టదాయకం కాగలదు.
రాష్ట్రంలో మామూలు పరిస్థితులను పునరుద్ధరించి, ప్రశాంత వాతావరణంలో అర్థవంతమైన చర్చలను సాగించే బాధ్యత కేంద్రంపైన, అన్ని రాజకీయ పార్టీలపైన ఉంది. హింసాకాండకు పాల్పడి, సాధారణ జీవనానికి అంతరాయం కలిగించాలని కోరుకునే వారిని తగిన రీతిలో శిక్షించాలి. అదే సమయంలో ఎన్నికైన ప్రస్తుత ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని తిరిగి పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్లకు పైగా గడువు ఉంది. తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు అధికారం కల్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను కూడా పునరుద్ధరించాలి. తెలంగాణ ప్రాంత అభివృద్ధి సమస్యలను మరింత మెరుకైన రీతిలో పరిష్కరించే కృషిలో ఈ ప్రాంతానికి చెందిన అర్హులైన ప్రొఫెషనల్స్ కూడా ప్రమేయం కల్పించాలి.
Pages: -1- 2 News Posted: 7 January, 2010
|