అద్వానీ కోసం ఒక కుర్చీ
'అందువల్ల (వాజపేయి అస్వస్థతతో ఉన్నందున) అద్వానీని వర్కింగ్ చైర్మన్ ను చేయాలని మేము యోచిస్తున్నాం. భగవంతుని దయ వల్ల అటల్జీ ఇంకా అనేక సంవత్సరాలు మనతోనే ఉంటారు. ఆయన ఉన్నంత కాలం ఆయన నేమ్ ప్లేట్ ను తొలగించరు' అని బిజెపి కీలక నాయకుడు ఒకరు పేర్కొన్నారు. ముందు వాజపేయికి ఈ విషయం సూచించి, ఆతరువాత ఎన్ డిఎ మిత్ర పక్షాలకు తెలియజేయనున్నట్లు ఆయన చెప్పారు.
జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు, ఎన్ డిఎ కన్వీనర్ శరద్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'ఇంతవరకు మా అభిప్రాయాన్ని ఎవరూ కోరలేదు. ఇది బిజెపి ఆంతరంగిక వ్యవహారం. మార్పు అవసరమైన పక్షంలో మమ్మల్ని సంప్రతిస్తారని బావిస్తున్నా' అని చెప్పారు. మరి అద్వానీని వర్కింగ్ చైర్మన్ గా అంగీకరిస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి శరద్ యాదవ్ నిరాకరించారు.
Pages: -1- 2 News Posted: 9 January, 2010
|