ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు ఈ డిపాజిటరీ 2011 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ పథకం అమలు కోసం ఒక ప్రాతిపదిక (రోడ్ మ్యాప్) రూపకల్పనకు ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ సంజయ్ ధాండె నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద, 2011 సంవత్సరానికి ముందు ఉత్తీర్ణులయ్యే ఎవరైనా తన సర్టిఫికెట్లను ఈ డిపాజిటరీలో అప్ డేట్ చేసుకోవచ్చు. టెక్నాలజీ ఆధారిత పరిష్కారం వల్ల విద్యా సర్టిఫికెట్లకు భద్రత, ధ్రువీకరణ లభిస్తాయి. ఆన్ లైన్ లో నిర్థారించుకోవచ్చు. పోగొట్టుకున్న సర్టిఫికెట్లను సులభంగా తిరిగి పొందవచ్చు.
ప్రస్తుతం రెండు డిపాజిటరీలు - నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్ డిఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (సిడిఎస్ఎల్) - సెక్యూరిటీస్, ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) వద్ద నమోదై ఉన్నాయి. స్కూల్ బోర్డులు, ఐఐటిలు, ఎన్ఐటిలు, పాలిటెక్నిక్ లు, రాష్ట్ర స్కూల్ బోర్డులతో సహా అన్ని విద్యా సంస్థలకు డిపాజిటరీతో అనుసంధానం ఉంటుంది.
Pages: -1- 2 News Posted: 13 January, 2010
|