కొత్త వర్శిటీలకు ఒకే చట్టం అయితే, ఇంకా పేరు పెట్టని, హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ రూపొందిస్తున్న ఈ కొత్త సంస్కరణల బిల్లు కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటును, డిగ్రీలు ప్రదానం చేసే వాటి హక్కును మొదటిసారిగా వేరు చేస్తుంది. ఈ కొత్త ప్రతిపాదిత చట్టం కింద, కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకునే ప్రైవేట్ సంస్థ గాని, ప్రభుత్వం గాని ఎన్ సిహెచ్ఇఆర్ ను సంప్రదించవలసి ఉంటుంది. (ఎన్ సిహెచ్ఇఆర్ ఉన్నత విద్య రెగ్యులేటర్ గా వ్యవహరించబోతున్నది) ఎన్ సిహెచ్ఇఆర్ ఆ దరఖాస్తుదారుని ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించి, తాను సంతృప్తి చెందితే విశ్వవిద్యాలయ ప్రతిపత్తి మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతుంది. అప్పుడు కొత్త విద్యా సంస్థను సంస్కరణల చట్టానికి అనుసంధానించిన షెడ్యూల్ లో భాగం చేస్తారు. అప్పటికీ పార్లమెంట్ ఈ షెడ్యూల్ కు సవరణలను ఆమోదించవలసిన అవసరం ఉంటుంది. అయితే, కొత్త చట్టాల రూపకల్పనకు, మంజూరు కోరడానికి లేదా ఒక చట్టానికి సవరణలు చేయడానికి పట్టే సమయం కన్నా ఇందుకు తక్కువ సమయం పట్టుతుంది.
పార్లమెంటు ఆమోదముద్ర అనంతరం షెడ్యూల్ కు చేర్పు వల్ల కొత్త విశ్వవిద్యాలయం సృష్టి చట్టబద్ధత వస్తుంది. అయితే, ఇప్పటి వలె కాకుండా డిగ్రీలు ప్రదానం చేసేందుకు అధికారం నేరుగా సంక్రమించదు. నిర్దిష్ట కోర్సులలో డిగ్రీల ప్రదానానికి అధికారం కల్పన కోసం విశ్వవిద్యాలయం విడిగా ఎన్ సిహెచ్ఇఆర్ కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఒక డిగ్రీ ప్రదానం చేయడానికి కావలసిన నాణ్యత ప్రమాణాలను విశ్వవిద్యాలయం కలిగి ఉందని ఎన్ సిహెచ్ఇఆర్ సంతృప్తి చెందితే, ఈ అధికారం మంజూరవుతుంది. కొత్త విశ్వ విద్యాలయాలకు చట్టబద్ధమైన అనుమతి లభించేందుకు చాలా వ్యవధి అవసరమవుతోందనే కారణంతో కొన్ని సంవత్సరాలుగా డీమ్డ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. అయితే, వీటిలో పలు సంస్థలు అనైతిక పద్ధతులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇవి వివాదాస్పదం అవుతున్నాయి.
దేశంలో ఇప్పుడు ఉన్న వాటి కన్నా ఎక్కువగా ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు కావలసిన ఆవశ్యకత ఉందని పలు నివేదికలు సూచించాయి. నేషనల్ నాలెడ్జి కమిషన్ (ఎన్ కెసి) కూడా ఇదేవిధమైన సిఫార్సులు చేసింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) గుర్తింపు పొందిన తరువాత డిగ్రీలను ప్రదానం చేయగల డీమ్డ్ విశ్వవిద్యాలయాల వల్ల డిమాండ్, సప్లయి మధ్య అంతరాన్ని పూడ్చవచ్చునని ఈ సంస్థల మద్దతుదారులు వాదిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 13 January, 2010
|