సౌండ్ చేస్తే ఇక రౌండే అర్దరాత్రి సమయంలో నివాసిత ప్రాంతాల్లో భారీ శబ్దంతో భవంతుల నిర్మాణపనులు చేపట్టడం, మ్యూజిక్ హూరెత్తించడం, వాహనాల హారన్ లతో శబ్ధకాలుష్యం వెల్లువెత్తుతోందని గతంలో సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. రాత్రి 10 గంటల నుండి తెల్లవారు 6 గంటల మధ్య ఎటువంటి శబ్దకాలుష్యం లేకుండా చూడాలని, ఈ మేరకు నియమ నిబంధనలు రూపోందించాలని కేంద్రప్రభుత్నాన్ని అప్పట్లో సుప్రీం ఆదేశించింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ శబ్దకాలుష్య నిబంధనలను 2000 సంవత్సరంలో రూపోందించింది. నివాసిత ప్రాంతాల్లో శబ్ధకాలుష్యం 5 డిసిబిల్స్ కు మించరాదని, మ్యూజిక్ సిస్టమ్ సౌండ్ పక్కింటికి సైతం వినపడకూడదని నిబంధనల్లో పేర్కొంది. ఆలాగే ఆసుపత్రి, విద్యాసంస్దలు ఉన్న ప్రదేశాల్లో టపాసులు కాల్చడం, వాహనాలు హారన్లు మోతెక్కించడం, భారీ శబ్థంతో నిర్మాణపనులు చేపట్టడం వంటి వాటిని నిషేధిస్తూ పర్యావరణ శాఖ నిబంధనలను రూపోందించింది.
అయితే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందకు ఆ శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా 24 డెసిబిల్స్ కు మించి మెట్రో నగరాల్లో శబ్దం వస్తే ఆటోమెటిక్ వాటిని నమోదు చేసేందుకు పది పర్యవేక్షక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ పరికరాల్లో నమోదైన వివరాలను బట్టి పోలీసులు రంగ ప్రవేశం చేసి తగిన చర్యలు తీసుకుంటారు. అంతేగాక ఎవరైనా శబ్ధకాలుష్య బాధితులు పోలీస్టషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు కూడా సుమెటోగా కేసు నమోదు చేసేలా నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి దాదాపు లక్ష రూపాయలు వరకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించేలా నిబంధనలు రూపొందాయి. దీంతో ఈ జరిమానా, జైలుశిక్షల నుండి తప్పించుకోవాలంటే రాత్రి సమయంలో జాగ్రత్త వహించాల్సిందే మరి.
Pages: -1- 2 News Posted: 15 January, 2010
|