హమ్మో! ఎంత అవినీతి? ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక గుర్తింపు కార్డు పథకాన్ని సమాజానికి న్యాయం సాధనకు పెద్ద అవరోధంగా ప్రహ్లాద పేర్కొన్నారు. అవకాశాలలో అసమానతను రూపుమాపేందుకు వీలుగా భారీ స్థాయిలో విద్యా సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని ఆయన కోరారు. 'ఇండియా ఆసక్తికరమైన కూడలిలో ఉన్నది. గణనీయమైన వినూత్న మార్పులు అవసరమైన ప్రగతి పంథాను అనుసరించడమా లేక పాతకు స్వస్తి చెప్పి కొత్తకు స్వాగతం చెప్పడమా అనేది తేల్చుకోవాలి' అని ప్రహ్లద అన్నారు.
ఇండియాలో సంక్షోభం నాయకత్వానికి సంబంధించినదని ఆయన పేర్కొన్నారు. 'రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన నవ భారత నిర్మాణానికి కావలసిన త్యాగాలు చేసేవిధంగా, దేశాన్ని సంఘటితం చేసేవిధంగా భారతదేశం అభిప్రాయాన్ని, భారతీయతను స్పష్టంగా, కచ్చితంగా తన మాటలలో చెప్పగలవారు ఎవ్వరూ లేరు' అని ప్రహ్లాద అన్నారు.
Pages: -1- 2 News Posted: 15 January, 2010
|