కేసీఆర్ ఇంట్లో కుంపటి? అయితే నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష లో రాజకీయ తెరపైకి వచ్చారు. విద్యార్ధులతో కలిసి ఆమె సంచలన సంఘటనలకు తెర తీశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అదుర్స్' సినిమాని తెలంగాణ జిల్లాల్లో ప్రదర్శించనీయబోమని మీడియా ద్వారా ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కవిత చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అదుర్స్ పై ఆమె ఇచ్చిన పిలుపు రాజకీయంగా తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. తెరాస లేదా దాని సృష్టి అయిన జెఎసితో ఎలాంటి సంబంధం లేకుండా అదుర్స్ పై ఆమె రేపిన వివాదం తెరాస నాయకత్వాన్ని ఇరుకున పెట్టింది. జెఎసిలో మిత్రపక్షంగా ఉంటున్న తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకుల నుంచి విమర్శల వాన ప్రారంభం అయింది. అంతేకాకుండా జిల్లాల్లో సామాన్య జనం సైతం కవిత పిలుపు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. చివరకు తెరాస నాయకులు రంగంలోకి దిగి కవిత చేసిన దుందుడుకు చర్యను చక్కదిద్దుకోడానికి నానా పాట్లూ పడ్డారు.
అయితే కవిత మాత్రం వ్యూహాత్మకంగానే అదుర్స్ ను అడ్డుకోవాలని ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సిరిసిల్ల స్థానం నుండి ఎన్నికల బరిలో నిలవాలని కవిత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమె సోదరుడు కె టి రామారావు కారణంగా తృటిలో ఆవకాశం చేజారింది. అయితే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలంటే ఇప్పటి నుండే రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భావించిన ఆమె అదుర్స్ సినిమాను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇరికించారనే వాదనలు వినవస్తున్నాయి. తన అన్న కంటే రాజకీయంగా ప్రధాన స్రవంతిలో ఉంటేనే తనకు వచ్చే సారి చాన్స్ దక్కుతుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉధృతంగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తన లక్ష్యానికి అనుగుణంగా వినియోగించుకోవాలని ఆమె ధృడ సంకల్పంతో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మొత్తానికి టీఆర్ఎస్ అధినేత ఇంట్లో రాజకీయ అధిపత్య పోరు ఆరంభమైనట్లే.
Pages: -1- 2 News Posted: 15 January, 2010
|