వానాకాలం చదువులు
ఇంగ్లీషులోనే కాదు, మ్యాథ్స్ లోనూ ఇదే దుస్థితి కొనసాగింది. ఒకటి నుండి తొమ్మిది వరకు గల అంకెలను సైతం గుర్తించలేని బాలలు 69 శాతం మంది ఉన్నారంటే పరిస్ధితి అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో 50 నుండి 60 శాతం మంది అంకెలను గుర్తించలేకపోగా, కేరళలో మాత్రం 90 శాతం బాలలకు అంకెలన్నీ వచ్చినట్లు తేలింది. అంకెలు సైతం రాని విద్యార్థులు కేవలం ఒకటో తరగతి వారు మాత్రమే కాకుండా ఐదో తరగతి బాలలు కూడా ఉన్నట్లు స్పష్టమైంది. ఐదో తరగతి విద్యార్థులకు కూడా 11 నుండి 99 మధ్య అంకెలు రాని వారు 54.6 శాతం మంది ఉన్నారని సర్వేలో స్పష్టమైంది. అలాగే గుణింతాలు వచ్చిన వారు కేవలం 38 శాతమేనని ప్రథమ్ సంస్థ పేర్కొంది. ఈ విభాగంలో గోవా 80 శాతంతో కాస్త మెరుగుదల చూపిందని ఆ సంస్థ వివరించింది.
ఈ సర్వే కోసం ప్రథమ్ సంస్థ దేశవ్యాప్తంగా 575 జిల్లాల్లో దాదాపు 7 లక్షల మంది విద్యార్థులను కలసి ఈ సర్వే నిర్వహించి, నివేదిక రూపొందించింది. అయితే ఈ మొత్తం సర్వేలో కాస్త ఊరటనిచ్చే అంశం ఏమిటంటే ఎక్కువ శాతం బాలలు స్కూలుకు రోజూ వెళుతున్నట్లు తేలడమే.
Pages: -1- 2 News Posted: 16 January, 2010
|