కొత్త దారిలో రోశయ్య?
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండిసి) ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్రంలోనే కొనసాగించేట్లు చూసేందుకు రోశయ్య ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నది. 'రాష్ట్రంలో ఈ ఫ్యాక్టరీని స్థాపించాలని నిర్ణయించుకున్న తరువాత ఆ సంస్థ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నది. ఎన్ఎండిసి అధికారులతో మాట్లాడి వారిలో భయాందోళనలు తొలగించవలసిందిగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి కె. సాయి ప్రతాప్ కు మేము విజ్ఞప్తి చేశాం' అని ఆ అధికారి తెలిపారు. రోశయ్య ఈ నెల 22 నుంచి జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. అధికారులు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారు. అనావృష్టి, వరద సహాయం, విద్యుత్ సరఫరా, పిడిఎస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇందిరమ్మ గృహవసతి అంశాలపై ఈ సమావేశాలలో సమీక్ష జరుపుతారు.
రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతున్నదనే అభిప్రాయం న్యూఢిల్లీలో ఉందని, వ్యవహారాలు చక్కబెట్టేందుకు తక్షణం చర్యలు తీసుకోవలసిందని ముఖ్యమంత్రికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.'వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో మొదట సమావేశం జరిపి ఉండవలసింది. కాని మా కన్నా ముందే గవర్నర్ ఆ పని చేశారు. దీనితో మాకు అపప్రథ వచ్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని మేము అనుకుంటున్నాం' అని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే రాష్ట్రాన్ని విభజించవలసిందేనని వాదిస్తున్నవారు తెలంగాణపై సానుకూల ప్రకటన చేసేందుకు కేంద్రానికి రాజకీయ పార్టీలు ఇచ్చిన 'గడువు' జనవరి 28 తరువాత తిరిగి ఊపిరి పోసుకుంటారేమోనని రాష్ట్ర వర్గాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 16 January, 2010
|