డ్రైవింగ్ లైసెన్సు గగనమే సరైన శిక్షణ పొందిన వారికి మాత్రమే లైసెన్సులు జారీ చేసేట్లు చూసేందుకై రాష్ట్ర రవాణా శాఖలను విభజించవచ్చునని కూడా అధికారులు సూచించారు. 'ఒక విభాగం డ్రైవర్ల శిక్షణకు బాధ్యత వహిస్తుంది. రెండవది లైసెన్సులు జారీ చేస్తుంది. ప్రతి రాష్ట్రంలో సరైన మౌలిక వసతులతో గుర్తింపు ఉన్న డ్రైవింగ్ శిక్షణ సంస్థలు మాత్రమే ఉండాలన్న ఈ రంగంలోని నిపుణుల సూచనను మేము పరిశీలిస్తున్నాం. చిన్న రాష్ట్రాలలో ఒక శిక్షణ సంస్థ, పెద్ద రాష్ట్రాలలో రెండు శిక్షణ సంస్థలు ఉండవచ్చు' అని సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. కేంద్ర సాయంతో, లేదా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఈ మోడల్ శిక్షణ సంస్థలు తమ ప్రాంతంలోని ఆసక్తిగల డ్రైవర్లందరికీ తప్పనిసరిగా శిక్షణ గరపాలి.
డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేవారందరూ ఒక కంటివైద్య నిపుణుని వద్ద తమ కళ్ళ పరీక్ష చేయించుకోవలసిన అవసరం, ఒక ఎంబిబిఎస్ డాక్టర్ వద్ద నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందవలసిన అవసరం ఉంటాయి. ఇక వాణిజ్య, భారీ వాహనాల విషయంలో ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. ఈ వాణిజ్య, భారీ వాహనాల వల్లే దేశంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలలో మరణాలు సంభవిస్తున్నాయి. కాలం తీరిన వాణిజ్య వాహనాలను దశలవారీగా తప్పించే ప్రణాళికను కూడా కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. 'ఉదాహరణకు, నగరాలలో పదేళ్ళకు పైగా నడుస్తున్న బస్సులను ఇకమీదట నడవనివ్వరు. ఓవర్ లోడ్ చేసినట్లుగా తేలిన ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాలను కనీసం ఆరు మాసాల పాటు స్వాధీనం చేసుకుంటారు' అని ఒక అధికారి తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 16 January, 2010
|