తెలంగాణ ఇవ్వాలంటే...? నరసింహన్ ను గవర్నర్ గా కొనసాగించాలని కేంద్రం మరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆయన తాత్కాలిక గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు 'నరహంతక నరసింహన్ గో బ్యాక్ (నరహంతక నరసింహన్ తిరిగి వెళ్ళిపో)' అని మావోయిస్టులు ఆవేశంతో నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనను ఆలస్యం చేయడానికే నరసింహన్ ను తీసుకువచ్చారా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ వాదులు కొందరు ప్రకటనలు విడుదల చేశారు కూడా.
నరసింహన్ ను గవర్నర్ గా ఖాయం చేయడం ద్వారా రాష్ట్రాన్ని వేధిస్తున్న సమస్యల విషయంలో తాను కఠిన వైఖరి అవలంబించనున్నాననేది కేంద్రం స్పష్టం చేసింది. కాగా, తెలంగాణ ప్రాంత ఎంఎల్ఎలు పలువురు తమ రాజీనామాలను ఉపసంహరించుకోనందున పార్టీ రాష్ట్ర శాఖ పని తీరుపై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తితో ఉంది. తెలంగాణ జెఎసికి దూరంగా మెలగవలసిందని ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం తిరిగి ఆదేశాలు జారీ చేసింది.
Pages: -1- 2 News Posted: 18 January, 2010
|