జూనియర్లకు ప్రధాని మంత్రం అయితే, క్యాబినెట్ మంత్రులు పూర్తిగా ఆధిపత్యం వహిస్తున్న మంత్రిత్వశాఖలలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. విధాన నిర్ణయంలో తమ ముద్ర వేయడానికి వారు ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు తన సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విధుల కేటాయింపు విషయంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఆనంద శర్మ 'లోభి'లా వ్యవహరిస్తున్నార ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) మొదటి ప్రభుత్వంలో అర్జున్ సింగ్ క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) మంత్రిత్వశాఖలో సహాయ మంత్రిగా రాణించిన డి. పురందేశ్వరికి ఇప్పుడు మరింత చొరవ చూపే క్యాబినెట్ మంత్రి కపిల్ సిబల్ హయాంలో చేసేందుకు అంతగా పని ఉండడం లేదు. ఇందుకు హోమ్ శాఖ మంత్రి పి.చిదంబరం, పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరాల తీరు ఇందుకు పూర్తి విరుద్ధం. తాము హాజరైనప్పటికీ పార్లమెంట్ లో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే బాధ్యతను వారిద్దరు తమ సహాయ మంత్రులకు అప్పగిస్తుంటారు. చాలా మంది క్యాబినెట్ మంత్రులు అలా అనుమతించరు కూడా.
క్యాబినెట్ మంత్రి పూర్తి ఆధిపత్యం నుంచి జూనియర్ మంత్రులకు కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రధానితో పాటు కాంగ్రెస్ తరఫున కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'ఏదైనా ప్రభుత్వం ఏర్పడి, మంత్రిత్వశాఖల కేటాయింపు జరిగినప్పుడు, సీనియర్ మంత్రులు, సహాయ మంత్రుల మధ్య పరస్పర అవగాహనకు కొంత సమయం పట్టుతుంది. తమ తమ బలాలు, బలహీనతలు, నిర్ణయం తీసుకోగల సామర్థ్యం ఎటువంటిదో అర్థం చేసుకోవడానికి వ్యవధి అవసరం' అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోని అభిప్రాయం వెలిబుచ్చారు. 'విధాన నిర్ణయం విషయంలో మరింత సమర్థంగా తమ సీనియర్ మంత్రులకు సహాయ మంత్రులు సాయపడేందుకు ఒక పద్ధతిని రూపొందించనున్నాం' అని సోని చెప్పారు.
Pages: -1- 2 News Posted: 18 January, 2010
|