లోపాలే శాపాలు 9.02 సమయంలో చెన్నై ఏటీసీతో మాట్లాడారు. వారు మళ్లీ 9: 30 కి కాంటాక్ట్ చేయమన్నారు. 09:10:50 కు64 నాటికల్ మైళ్లు ప్రయాణించి మేఘాల్లో ప్రవేశించింది. ( ఈ సమయంలో ముందుకు వెళ్లకుండా వెనుదిరిగి ఉండాల్సిందని నివేదికలో త్యాగి అభిప్రాయపడ్డారు). 9:12:52 కు హైదరాబాద్ ఏటీసీతో చివరసారిగా కాంటాక్ట్ లోకి వచ్చారు. అప్పుడు 5,500 అడుగుల ఎత్తులో, 140 నాటికల్ మైళ్ల వేగంతో హెలికాప్టర్ ప్రయాణిస్తోంది. 9:13 కు హైదరాబాద్ రాడర్ పరిధి నుంచి హెలికాప్టర్ అదృశ్యమైంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ సమాచారం మేరకు ఈ సమయంలోనే మేఘాలను తప్పించుకునేందుకు కొద్దిగా ఎడమవైపు వెళ్లాలనుకుని, కర్నూలు దాటాక మళ్లిస్తే సరిపొతుందనుకున్నరు. 9;20కి కర్నూలు దాటుతూ వాతావరణం మెరుగుపడుతుందేమో అనుకున్నారు. 9:20:46కి హెలికాప్టర్ వేగం 40 నాటికల్ మైళ్లకు తగ్గిపోయింది. దీంతో ఆటోమోడ్ డీ- యాక్టివేట్ కావడంతో కో- పైలట్ దానిని యాక్టివేట్ చేసారు. 9:21:07 కు ఇంధన సరఫరాలో లోపాన్ని కనుగొన్నారు. ఇంధనం ప్రెషర్ బాగా తగ్గింది. 9:27:24 కు కో- పైలట్ 'గో అరౌండ్ ' అంటూ కేకలు వేసాడు. సరిగ్గా 9:27:51 కు హెలికాప్టర్ కూలిపోయింది. కాక్ పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఆగిపోయింది. ఆ సమయంలో హెలికాప్టర్ నిమిషానికి 14,200 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.
చివర 12 సెకెన్ లలో హెలికాప్టర్ పతనం ఇలా ఉందని త్యాగి వివరించారు.0-3.6 సెకెన్ 550 నుండి850 అడుగుల కిందకు ఒక్కసారిగా జారింది.3.6-8.4 సెకెన్ లలో1200 అడుగులు, 8.4-10.8 సెకెన్ లలో 600 అడుగులు, 10.8 నుంచి 12 సెకెన్ లలో 2, 800 అడుగులు పడిపోయి కొండను ఢీ కొని పేలిపోయిందని వెబ్ సైట్ లో ఉంచిన నివేదికలో త్యాగి పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 22 January, 2010
|