వెబ్ సైట్లకూ చైనా నకిలీ కాగా, ఈ విషయమై వ్యాఖ్యానించడానికి ఈ రెండు సైట్ల సృష్టికర్తలు గురువారం అందుబాటులో లేరు. 'నేను ఒక ప్రజా సేవగా ఈ పని చేశాను' అని యూట్యూబ్ అనుకరణ సైట్ వ్యవస్థాపకుడు లీ సెన్హె 'ది క్రిస్టియన్ సైన్స్ మానిటర్' పత్రిక విలేఖరికి పంపిన ఒక సందేశంలో తెలియజేశారు. అయితే, ఈ నకిలీ యూట్యూబ్ సైట్ పట్ల కొందరు చైనీయులు వెంటనే హర్షం వెలిబుచ్చారు. 'ఇది దీర్ఘకాలం కొనసాగుతుందా అనేది నాకు తెలియదు' అని బ్లాగర్ జియా ఝెంగ్ జింగ్ పేర్కొన్నారు. సెన్సార్ షిప్ కు వ్యతిరేకంగా జియా తన బ్లాగ్ లో వ్యాఖ్యలు పొందుపరిచారు.
మరొక సైట్ గూజ్జె ఒక కార్యనిర్వాహక సర్చ్ ఇంజన్. ఇది గూగుల్, చైనాలోని దాని ప్రధాన ప్రత్యర్థి బైదు సైట్ల సమాహారంగా కనిపిస్తున్నది. 'కచ్చితంగా మాట్లాడితే గూజ్జె సర్చ్ ఇంజన్ కాదనే చెప్పాలి. ఇది స్నేహితులను అన్వేషించేందుకు ఉపయోగించే వేదిక మాత్రమే' అని వ్యవస్థాపకులలో ఒకరైన గ్జియావో గ్జువాన్ బుధవారం 'హెనాన్ బిజినెస్ డైలీ' పత్రిక విలేఖరికి తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 29 January, 2010
|