టాక్ట్ సంక్రాంతి సంబరం
టాక్ట్ సంక్రాంతి సంబరాల్లో అత్యంత ఆకర్షణీయంగా అందరినీ ఆనందసాగరతీరాలకు చేర్చిన కార్యక్రమం శాస్త్రీయ భరతనాట్యం. 'దశావతారాలు' అంశంపై శ్రీమతి స్వాతి కామాక్షి, దివ్య కృష్ణన్, స్వాతి కృష్ణన్ రూపొందించిన భరతనాట్యం ఆహూతులందరి మనసులను, హృదయాలనూ చూరగొంది. అక్షత, సాన్వి, మీరా, పూజ, ఇషిత, జయలక్ష్మి, నేహ, రియా, శ్రీమతి విజయ తదితర 14 మంది నృత్య బృందం ప్రదర్శించిన 'శ్రీ వినాయక' కూచిపూడి నృత్య ప్రదర్శన, కృష్ణ సంపద, రాశి, చిన్ను, లీల, చరిత ప్రదర్శించిన కూచిపూడి తరంగం రెండింటికీ ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా చక్కని ప్రతిస్పందన లభించింది.
సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టాక్ట్ కార్యనిర్వాహకవర్గం సంక్రాంతి సందర్భంగా రంగోళి పోటీలు కూడా నిర్వహించింది. పెద్దలు, చిన్నారుల విభాగాల్లోను, చిన్నారులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలకు మంచి స్పందన వచ్చింది. పెద్దలకు నిర్వహించిన రంగోళి పోటీల్లో సంపత్, శ్రీదేవి కారాబత్తుల, అనుపమ తమ్మన బహుమతులు గెలుచుకున్నారు. చిన్నారుల విభాగంలో సహజ, రికిహ ముప్పాళ్ళ విజేతలుగా నిలిచారు. వ్యాసరచన పోటీలో సాహితి అలవలతో కలిపి సహజ కారాబత్తుల బహుమతిని అందుకుంది.
టాక్ట్ సంస్థ లక్ష్యాల గురించి ప్రెసిడెంట్ రావు యలమంచిలి వివరించారు. వచ్చే ఉగాది ఉత్సవాలను ఏప్రిల్ లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పావని అలవల వ్యాఖ్యాతగాను, శ్రీధర్ అర్వపల్లి రిజిస్ట్రేషన్ డెస్క్ కార్యక్రమాలను, తెలుగు వెలుగు మ్యాగజైన్ సంపాదక మండలి సభ్యురాలు సంగీత సురభి టాక్ట్ కార్యనిర్వాహకవర్గానికి సహాయ సహకారాలు అందించారు.
సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి శ్రీమతి శారద జొన్నలగడ్డ, ట్రోఫీలు ప్రదానం చేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ టాక్ట్ ట్రస్టీ, పూర్వ అధ్యక్షురాలు శ్రీమతి సుమ వట్టిగుంట పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
Pages: -1- 2 News Posted: 29 January, 2010
|