పైలట్ గా మాజీ మంత్రి రూడీ ఇండిగో విమానాన్ని నడుపుతున్నట్లు ఇండియా ఎయిర్ లైన్స్ సంస్థ అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ ధ్రువీకరించారు. రూడీ ఇంతవరకు ఢిల్లీ - ముంబై సెక్టర్ లో ఐదు విమానాలను నడిపారు. అయితే, రాజకీయాలకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయి వృత్తిగా దీనిని చేపట్టాలని తాను యోచించడం లేదని రూడీ స్పష్టం చేశారు. 'నేను ముందుగా ఇష్టపడేది రాజకీయ రంగాన్నే. నా జీవితంలో 20 ఏళ్లకు పైగా ఈ రంగంలోనే గడిపాను. దీనిన వదలిపెట్టే ఆలోచన అసలే లేదు. అంతేకాదు. నేను క్వాలిఫైడ్ న్యాయవాదిని, మగధ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ ను కూడా' అని రూడీ తెలియజేశారు.
అటల్ బిహారి వాజపేయి సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) ప్రభుత్వంలో 2001 సెప్టెంబర్ నుంచి 2003 మే వరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగాను, 2003 మే 24 నుంచి 2004 మే 21 వరకు పౌర విమానయాన శాఖ మంత్రిగాను రూడీ బాధ్యతలు నిర్వహించారు. అయితే, పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన హయాంలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. అన్నిఇండియన్ ఎయిర్ లైన్స్ (ఐఎ), అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాల కిటికీ అద్దాలపై పగుళ్ల గురించి, ఈ రెండు విమాన సంస్థల పైలట్లు, క్యాబిన్ సిబ్బంది బస చేసే హోటళ్ల గురించి, వారికి టాక్సీలు సమకూర్చిన వారి గురించి, కేటరింగ్ కాంట్రాక్టుల గురించి సమాచారం కోరుతూ ఆయన లేఖలు పంపారు. ఢిల్లీ సఫ్దర్ జంగ్ విమానాశ్రయంలో తన బుకింగ్ స్థలాన్ని ప్రైవేట్ విమాన సంస్థలకు అద్దెకు ఇవ్వాలని కూడా ఐఎను రూడీ కోరారు.
Pages: -1- 2 News Posted: 30 January, 2010
|