మెడికల్ పిజి ఇక ఈజీ ఈ విస్తరణ కార్యక్రమంలో నష్టపోయేది మహారాష్ట్ర మాత్రమే కావచ్చు.తమిళనాడు, కర్నాటక ఇటీవలి కాలంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు భారీగా నిధులు వెచ్చించడమే కాకుండా అత్యధిక పారితోషిక ప్యాకేజీలను ఆఫర్ చేయడం ద్వారాను, ప్రైవేట్ ప్రాక్టీసుకు అనుమతించడం ద్వారాను సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులను ఆకర్షించాయి కూడా. అయితే, మహారాష్ట్ర పెక్కు సంవత్సరాలుగా ఉన్నత ప్రొఫెషనల్ విద్యకు అత్యల్ప బడ్జెట్ కేటాయింపులు, ఫ్యాకల్టీ ఖాళీల కారణంగా నష్టపోయింది.
'ఒక్కొక్క సబ్జెక్ట్ లో తమ వద్ద గల ఫ్యాకల్టీ సభ్యుల జాబితాను మాకు అందజేయవలసిందిగా ప్రతి కాలేజీని మేము కోరాం. మాకు అందిన సమాచారం ఆధారంగా అవి చేర్చుకునే విద్యార్థుల సంఖ్యను మేము పెంచాం' అని మిశ్రా తెలియజేశారు. ప్రైవేట్ వైద్య కళాశాలలు కూడా ఇదేవిధంగా విస్తరణను చేపడతాయి. అయితే, అదనపు సీట్ల కేటాయింపునకు ముందు వాటిని ఎంసిఐ తనిఖీ చేయవలసి ఉంటుంది.అయితే, విద్యార్థులు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే, మార్చి నెలాఖరుకల్లా దేశంలోని పిజి మెడికల్ సీట్లలో సుమారు 16500 మంది విద్యార్థులను చేర్చుకునేందుకు వీలు కలుగుతుందని ఎంసిఐ భావిస్తున్నది. ఎంసిఐ ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 1600 సీట్లకు మంజూరు లేఖలు పంపింది. ఈ విస్తరణ ప్రక్రియను చేపట్టడానికి ముందు దేశంలో వివిధ వైద్య కోర్సులలో 14260 సీట్లు ఉన్నాయి.
ఫ్యాకల్టీ ఖాళీల భర్తీయే ఇప్పుడు తమకు ప్రథమ ప్రాధాన్యమని మహారాష్ట్ర అధికారులు చెప్పారు. వచ్చే రెండు సంవత్సరాలలో కొల్హాపూర్, అకోలా, లాతూరులలోని తన వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించగలమని రాష్ట్ర ప్రభుత్వం ఎంసిఐకి తెలియజేసింది. (2001లో కొల్హాపూర్ కాలేజీని, 2002లో అకోలా, లాతూరు కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.) 'ఈ మూడు కాలేజీలలో మేము పిజి కోర్సులను ప్రారంభించిన తరువాత దేశంలో అత్యధిక సీట్లు ఉన్న రాష్ట్రం బహుశా మాదే కాగలదు' అని ఒక అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతానికి సీట్ల విస్తరణ ఇప్పటికే ప్రారంభమైనందున 2010 మే అడ్మిషన్ల సీజన్ లో ఏదైనా పిజి కోర్సుకు విద్యార్థుల మధ్య పోటీ కొంత సరళం కావచ్చు.
Pages: -1- 2 News Posted: 1 February, 2010
|