శ్రీకృష్ణ ఓకె, మరి...? అదేవిధంగా రవీందర్ కౌర్ ఐఐటి ఏర్పాటు చేసిన కొన్ని కమిటీలతో సహా వివిధ కమిటీలకు సారథ్యం వహించారు. 'ఆమె విద్యావేత్త. తన సబ్జెక్టుకు సంబంధించిన విషయాలపై ఆమెకు మంచి పరిజ్ఞానం ఉన్నది. కాని 60 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కు పరిష్కారాన్ని కనుగొనడంలో ఆమె ఎంత వరకు కృతకృత్యురాలు అవుతారో ఊహకు అందనిదే' అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఒకరు పేర్కొన్నారు. షరీఫ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీలలోను, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని యూనివర్శిటీ కోర్టులోను సభ్యుడుగాను ఉన్నారు. 'దేశంలో ముస్లింల ఆర్థిక, విద్యా విషయక ప్రతిపత్తిపై రాజీందర్ సచార్ కమిటీ నివేదిక రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు' అని విద్యావేత్త ఒకరు చెప్పారు.
కేంద్ర హోమ్ శాఖ మాజీ కార్యదర్శి దుగ్గల్ కు నక్సల్ సమస్యపై అత్యంత దృఢమైన అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తున్నది. 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించకపోవడానికి నక్సల్ సమస్యను ప్రధాన కారణంగా పేర్కొంటున్నందున ఈ బెడదను అధ్యయనం చేయడంలో ఆయన పాత్ర పోషించవచ్చు. అయితే, ఆయన నక్సల్ వ్యతిరేకి అనేది వాస్తవం' అని మాజీ ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే, శ్రీకృష్ణను మినహాయిస్తే కమిటీలోని సభ్యులకు ఈ బాధ్యత నిర్వహించలేనివారనే అభిప్రాయం ఉన్నప్పటికీ వారు మెరుగైన కృషి చేస్తారని రాజకీయ నాయకులు అనేక మంది ఆశిస్తున్నారు. 'ఇది సమతూకంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇద్దరు సభ్యులు మైనారిటీ వర్గానికి చెందినవారు కాగా, ఒకరు ప్రభుత్వ అధికారి, మరొకరు విద్యావేత్త. వారు సత్ఫలితాన్ని సాధిస్తారని ఆశిద్దాం' అని ఒక నాయకుడు అన్నారు.
Pages: -1- 2 News Posted: 4 February, 2010
|