ఆసుపత్రులా? మృత్యుకూపాలా? ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులు కూడా ఇందుకు భిన్నంగా లేవు. నగరంలోని ప్రధాన ఆసుపత్రి నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) అగ్నిమాపక శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ తన మిలెనీయం బ్లాకులో మూడు అంతస్తులను కొత్తగా నిర్మించింది. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి (ఒజిహెచ్), ఫీవర్ ఆసుపత్రి, నీలోఫర్, చెస్ట్ ఆసుపత్రితో సహా పలు ఆసుపత్రులు, రాష్ట్రంలోని ఇతర జిల్లా, ఏరియా ఆసుపత్రులలో ఏవో కొన్ని అగ్నిమాపక సాధనాలు మాత్రమే ఉన్నాయి. తమ ఆసుపత్రులలో సంభవించిన అగ్నిప్రమాదాల నుంచి ఒజిహెచ్, ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్ ఎటువంటి పాఠమూ నేర్చుకున్నట్లు లేదు.
ఇక గాంధీ ఆసుపత్రి కొత్త భవనంలో కొన్ని అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి. కాని అవి 'అలంకారప్రాయంగా' ఉన్నాయి. ఎందుకంటే అవి పని చేసే స్థితిలో లేవు. 'మెయింటెనెన్స్ కోసం మేము ఆసుపత్రి అధికారులకు ఎన్నో మార్లు గుర్తు చేశాం. కాని వారి నుంచి స్పందనే లేదు' అని అధికారి ఒకరు చెప్పారు. ఎన్ బిసి నిబంధనల ప్రకారం, ఆసుపత్రులలో తప్పనిసరిగా అగ్నిమాపక సాధనాలు, హోస్ రీల్, చేతితో ఉపయోగించే ఎలక్ట్రిక్ అలారమ్ వ్యవస్థలు, వెట్ రైజర్, డౌన్ కమర్, ఆటోమేటిక్ డిటెక్షన్, అలారమ్ సిస్టమ్ లు, 50 వేల లీటర్ల భూగర్భ నీటి ట్యాంకు, 5000 లీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో డాబాపై ట్యాంకు ఉండాలి.
Pages: -1- 2 News Posted: 4 February, 2010
|