7న అగ్ని-3 ప్రయోగం ఇది ఇలా ఉండగా, రానున్న వారాలలో లేదా మాసాలలో డిఆర్ డిఒ తీరికలేని కార్యక్రమాలలో నిమగ్నం కానున్నది. ఈ నెలలో విశాఖపట్నం వద్ద సముద్ర గర్భంలోని ఒక బల్లకట్టు నుంచి కె-15 క్షిపణిని మరొక మారు ఈ సంస్థ ప్రయోగించనున్నది. జలాంతర్గామిలో ఉండే స్థితిగతులను ఈ బల్లగట్టు ప్రతిబింబిస్తుంది. లోగడ జలగర్భంలోని బల్లకట్టులపై నుంచి కె-15 క్షిపణి ప్రయోగం జరిగింది. కాని ఈ సారి ప్రయోగించేది భిన్నమైనది. మార్క్-1గా పేర్కొన్న మొదటి వర్షన్ ను దేశీయంగా నిర్మించిన అణు ఇంధన శక్తితో పని చేసే జలాంతర్గామి 'అరిహంత్'లో అమరుస్తున్నారు.
నీటిలో నుంచి బయటకు వచ్చిన తరువాత కె-15 క్షిపణి గాలిలోకి 20 కిలో మీటర్ల ఎత్తుకు లేస్తుంది. ఇది 700 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి డిఆర్ డిఒ సాగరిక ప్రాజెక్టులో భాగం. కాగా, జలగర్భంలో నుంచి ప్రయోగించే కె-15 క్షిపణి భూతల సాధనం (వర్షన్) అయిన 'శౌర్య'ను ఒరిస్సాలోని బాలసోర్ లో ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జూన్ లో రెండవ సారి ప్రయోగించనున్నారు. ఇది ఇలా ఉండగా, 130 కిలో మీటర్ల ఎత్తులో శత్రుదేశపు బాలిస్టిక్ క్షిపణులను ఛేదించగల మన దేశపు ఇంటర్ సెప్టర్ క్షిపణి నాలుగవ ప్రయోగం సెప్టెంబర్ లో జరగనున్నది. డిఆర్ డిఒ ఇప్పటికే తన ఇంటర్ సెప్టర్ క్షిపణులు మూడింటితో హ్యాట్రిక్ సాధించింది.
Pages: -1- 2 News Posted: 6 February, 2010
|