కానుకగా జాక్సన్ ప్రతిమ క్లియరెన్సుల కోసం జాక్సన్ కుటుంబం నుంచి లిఖితపూర్వక అనుమతి లభించిన తరువాత యుఎస్ పశ్చిమ తీరానికి ఆ విగ్రహాన్ని వచ్చే నెల రవాణా చేయాలని సంస్థ యోచిస్తున్నది. ఒక ప్రతీకగా ఇలా విగ్రహానికి రూపకల్పన చేయడం ఈ నాలుగేళ్ల సంస్థకు మొదటిసారి కాదు. ధూమపానానికి వ్యతిరేకంగా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్ అన్బుమణి రామదాసు చేపట్టిన ప్రచారోద్యమం కోసం నలుపు, తెలుపు గ్రానైట్ లో ఒక అస్థిపంజరాన్ని ఈ సంస్థ నిరుడు చెక్కింది.
'గ్రానైట్ శిలల నుంచి ప్రత్యేక స్మారక చిహ్నాలు, విగ్రహాలు, ఇతర కళాఖండాలను చెక్కడం మా ప్రత్యేకత. మేము రూపొందించినవన్నీ ఆర్డర్ పై యూరోపియన్ కస్టమర్లకు ఎగుమతి చేశాం' అని చంద్రశేఖరన్ తెలిపారు. నల్లగ్రానైట్ పీఠంపై అమర్చిన, 'నరకం ఇష్టపడిన పౌరుడు' అనే శీర్షికతో అస్థిపంజరం విగ్రహాన్ని 2009 ఫిబ్రవరిలో చెన్నైలో గ్రానైట్ మాన్యుమెంట్ స్టోన్ ఫెయిర్ లోను, పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా 2009 మార్చిలో ముంబైలో నిర్వహించిన ఎగ్జిబిషన్ లోను ప్రదర్శించారు. 'ధూమపాన వ్యతిరేక ప్రచారోద్యమానికి అంకితం చేసిన ఆ విగ్రహాన్ని న్యూఢిల్లీలో ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యాలయం ఉన్న నిర్మాణ్ భవన్ లో ప్రతిష్ఠించారు' అని చంద్రశేఖరన్ తెలియజేశారు.
సంగీతాభిమాని అయిన చంద్రశేఖరన్ 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి రెండు ఆస్కార్లను, రెండు గ్రామీలను గెలుచుకున్న సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్ విగ్రహాన్ని రూపొందించాలని కూడా చంద్రశేఖర్ యోచిస్తున్నారు. 'రెహ్మాన్ కోరుకున్న రంగులో పోజులో గ్రానైట్ విగ్రహం చెక్కడానికి ఆయన అనుమతి తీసుకుంటాం. ఇంత పిన్న వయస్సులో ఆయన ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఎంతగానో పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చారు' అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు జరుగుతున్న ఎఐఇసిలో జాక్సన్ విగ్రహంతో పాటు ఇతర సంస్థలు గ్రానైట్ లో రూపొందించిన తాజ్ మహల్ ప్రతీకను, బాలీవుడ్ నటీమణి ఐశ్వర్యారాయ్ బచ్చన్ విగ్రహాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 6 February, 2010
|