ఆకాశంలో వాలంటైన్స్ డే
ఇదే బాటలో మరికొన్ని ప్రేమ జంటలు కూడా ఉన్నాయి. అయితే ప్రేమికుల్లో పెరుగుతున్న ఈ అభిరుచిని గమనించిన విమానయాన సంస్థలు కూడా దొరికిందే ఛాన్స్ గా సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ప్రేమికుల కోసం ప్రత్యేక చార్టర్ విమానాలను సిద్థం చేసి టూర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. నాలుగు సీట్లు ఉండే చాపర్ విమానాలను ఈ మేరకు సిద్థం చేసాయి. ఈ ఏడాది 14 వరకు చాప్టర్లను ప్రేమ జంటలు బుక్ చేసుకున్నట్లు ఎయిర్ నెట్జ్ ఏవియేషన్ సంస్థ అధికార ప్రతినిధి అమేయా గోర్ చెప్పారు. ఆలాగే ముంబయికి చెందిన సుమిత్ ఏవియేషన్ సంస్థ ప్రతినిధి లీనా జువేకర్ మాట్లాడుతూ, ఈ వాలంటైన్ దినోత్సవానికి తాము ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జంటలు కోసం రెండు రూట్లలో చాపర్లను నడుపుతున్నట్లు చెప్పారు. జుహు తీరం నుండి బోయ్ సార్ కు, కోలాబా నుండి అలీబాగ్ ల మధ్య ఈ చాపర్లను నడుపుతున్నామని ఆమె వివరించారు. అయితే వాలంటైన్స్ డే టూర్లలో అరగంట పాటు విహరించేందుకు ఒక్కో జంట నుండి 45,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
అయితే ఇవే టూర్లకు గతంలో 35 వేల రూపాయలు వసూలు చేసే విమానయాన సంస్థలు ప్రేమ జంటల తాకిడి పెరగడంతో ధరలను అమాంతంగా పెంచేసాయి. ప్రేమ మైకంలో ఎన్ని వేల రూపాయలైనా లెక్క చేయకపోయినా దిగిపోయిన తారువాత ... గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే... అంటూ జేబులు తడుముకోవచ్చు కూడా.
Pages: -1- 2 News Posted: 8 February, 2010
|