ప్రేమికులారా! జాగ్రత్త వాలంటైన్స్ డే ఇటీవలి కాలంలో దేశంలో అంతకంతకు ప్రజాదరణ పొందుతోంది. ఈ ఉత్సవం సూచికగా ఎర్ర బెలూన్లు, వెల్వెట్ దిండ్లు, టెడ్డీ బేర్ లను రీటైల్ వర్తకులు అమ్మడం ఎక్కువైంది. అయితే, ఛాందసవాదులు ఈ వేడుకలను 'సాంస్కృతిక అవినీతి'కి చిహ్నంగా అభివర్ణిస్తున్నారు. కాని, యువజనుల ఉత్సాహాన్ని ఇది నీరుకార్చలేకపోతున్నది. వి డేన కానుకలు, కార్డుల కొనుగోలు కోసం వారు షాపులకు ఎగబడుతున్నారు.
ప్రేమికుల రోజు కార్యక్రమాల నిర్వహణ ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు యువజనులకు 'వికృత మనస్తత్వాన్ని' అలవరుస్తున్నాయని బజరంగ్ దళ్ కో కన్వీనర్ జి. రమేష్ ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ఇటువంటి కార్యక్రమాలను నిలువరించాలని ఆయన కోరారు. ఇటువంటి కార్యక్రమాలు జరుగుపున్న వేదికలను బజరంగ్ దళ్ కార్యకర్తలు ముట్టడిస్తారని, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
వివిధ కాలేజీలకు వెళ్లి, వి డే జరుపుకోవద్దని విద్యార్థులను కోరాలని ఆ రెండు సంస్థల నాయకులు యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. క్రితం సంవత్సరం కూడా ప్రేమ పక్షులు వెళ్లే పాపులర్ ప్రదేశాల వద్ద కాషాయ పరివార్ కార్యకర్తలు తచ్చాడి, వారికి బలవంతంగా వివాహం చేయడానికి ప్రయత్నించారు. పెళ్లికి కావలసిన సరంజామాతో కాషాయ పరివార్ కార్యకర్తలు ఒక వాహనంలో సంచరించారు. వారు కొన్ని జంటలకు పెళ్లి చేశారు కూడా.
Pages: -1- 2 News Posted: 9 February, 2010
|