సిగరెట్లపై 'సుప్రీం' కన్ను అరైవల్ లాంజ్ లోని డ్యూటీ రహిత దుకాణంలో విక్రయిస్తున్న ప్యాకెట్లపై చట్టబద్ధమైన హెచ్చరికలు ఉన్నాయని, ఎందుకంటే వాటిని ఇండియాలో ఉపయోగిస్తున్నారని, కాని డిపార్చర్ లాంజ్ లోని దుకాణంలో విక్రయిస్తున్నవి విదేశాలలో ఉపయోగించేవని రోహతగి వాదించారు. డిపార్చర్ లాంజ్ లోని దుకాణంలో గల సిగరెట్ కార్టన్లపై ఈ హెచ్చరికలు ఉన్నాయని, కాని విడివిడి ప్యాకెట్లపై లేవని ఆయన తెలిపారు. 'అవి స్పెయిన్, జర్మనీ తదితర దేశాలలో ఉపయోగానికి ఉద్దేశించినవి. దేశం నుంచి విమానంలో వెళ్ళేవారికి అవి ఉద్దేశించినవి' అని ఆయన వాదించారు.
అయితే, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ వాదనను తోసిపుచ్చింది. 'ధూమపానం ఎక్కడైనా, స్పెయిన్ లో లేదా జర్మనీలో లేదా మరే దేశంలోనైనా ఆరోగ్యానికి హానికరమైనదే' అని బెంచ్ పేర్కొన్నది. ఇందుకు రోహతగి స్పందిస్తూ, 'ధూమపానం హానికరమైతే ఉప్పు, చక్కెర కూడా హానికరమైనవే' అని వాదించారు. అయినప్పటికీ మధ్యంతర వెసులుబాటు కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ విషయమై తన అభిప్రాయాలను నివేదించవలసిందిగా కస్టమ్స్ శాఖను సుప్రీం కోర్టు కోరింది.
ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ బ్రాండ్ ఫిలిప్ మోరిస్ డిపార్చర్ లాంజ్ లలోని డ్యూటీ రహిత దుకాణాలలో అమ్మే తన ప్యాకెట్లపై ఈ హెచ్చరికలను ముద్రించింది.
Pages: -1- 2 News Posted: 9 February, 2010
|