'అసంకల్పిత హంతకుడు' డాక్టర్ ముర్రేకు బెయిల్ మంజూరు కోసం 3 లక్షల డాలర్లు వసూలు చేయాలని ప్రాసిక్యూటర్లు కోరుతున్నారు. డాక్టర్ ముర్రేని డిప్యూటీలు కస్టడీలోకి తీసుకున్నారు కాని, ఆయనకు అందరి ముందు బేడీలు వేయలేదు. అమెరికా అంతటా ప్రయాణించవచ్చునని, కాని తన పాస్ పోర్ట్ ను పోలీసులకు అప్పగించాలని, దేశం వదలి వెళ్లరాదని డాక్టర్ ముర్రేకి బెయిల్ మంజూరు అనంతరం జడ్జి సూచించారు.
ఇది ఇలా ఉండగా, కోర్టు గదిలోకి ప్రవేశించడం కోసం జనం బారులు తీరి నిలబడ్డారు. ఇతరులు ఎవరూ లోపలికి రావడానికి ముందుగానే జాక్సన్ కుటుంబ సభ్యులను విడిగా కాపలాతో కోర్టు గదిలోకి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. అయితే, ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఈ కేసు విచారణ అసంఖ్యాకుల దృష్టిని ఆకర్షించనుంది. 50 సంవత్సరాల జాక్సన్ తాను తిరిగి కచేరీలకు హాజరు కావాలని సంకల్పించి తత్సంబంధిత ఒత్తిడికి సన్నద్ధం కావడానికై తనకు వ్యక్తిగత వైద్యునిగా ఉండవలసిందిగా డాక్టర్ ముర్రేని గత ఏడాది మే నెలలో కోరారు. దీర్ఘకాలంగా నిద్ర లేమితో బాధపడుతున్న జాక్సన్ ను నిద్రపుచ్చడానికి డాక్టర్ ముర్రే లాస్ ఏంజెలిస్ లో ఆయనకు శక్తిమంతమైన జనరల్ అనస్తెటిక్ ప్రొపోఫోల్ ను, మరి రెండు నిద్రమాత్రలను ఇచ్చిన తరువాత ఆయన మరణించినట్లు అధికారులు తెలియజేశారు.
ఐదు పేజీల ఫిర్యాదులో డాక్టర్ ముర్రేపై ఒకే ఒక తీవ్ర నేరారోపణ చేశారు. 'తగిన జాగ్రత్త, ఆలోచన లేకుండా' వ్యవహరించడం ద్వారా 'దురుద్దేశం లేకుండానే అక్రమ పద్ధతిలో చర్య తీసుకుని మైకేల్ జోసెఫ్ జాక్సన్ ను చంపారు' అని డాక్టర్ ముర్రే పై నేరారోపణ చేశారు. అయితే, ఈ ఫిర్యాదులో జాక్సన్ మృతికి సంబంధించిన వివరాలు ఏవీ లేవు. కాని డాక్టర్ ముర్రే అనెస్థెటిక్ మందు, ఇతర మందులు ఇచ్చిన తరువాత ఆ గాయకుడు మరణించారని అధికారులు తెలిపారు. అయితే, జాక్సన్ మృతికి దారి తీసే పనేమీ తాను చేయలేదని డాక్టర్ ముర్రే స్పష్టం చేశారు.
Pages: -1- 2 News Posted: 9 February, 2010
|