రాయితీలు కోరుతున్నరియల్టర్లు
హౌసింగ్ యూనిట్ల పరిమాణంపై ఆంక్షలతో పాటు అపార్టు మెంట్ విలువ, ఆదాయం ఆధారంగా కొనుగోలుదారుల అర్హతపై ఆంక్షల వల్ల కూడా ప్రయోజనం కలుగుతుంది. వినియోగదారుకు అనుకూలమైన రీతిలో ఈ పథకానికి తిరిగి రూపకల్పన చేయవలసి ఉంటుంది. సరసమైన రేట్లలో గృహవసతి లభించేట్లు చూడడానికై ఈ పరిశ్రమ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రతిపత్తితో సమీకృత టౌన్ షిప్ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపత్తితో ఈ ప్రాజెక్టులకు నిధులు ఎక్కువగా సమకూరగలవు.
వర్ధమాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ వర్ధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, జీవన వ్యయం పెరిగింది కనుక కనీస పన్ను మినహాయింపును రూ. 2 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా రుణాలపై వడ్డీ మినహాయింపును రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు పెంచాలని ఆయన సూచించారు. దీని వల్ల వెయ్యి చదరపు అడుగుల బిల్టప్ ఏరియా లోపు విస్తీర్ణంలో ఫ్లాట్ల నిర్మాణాన్ని పెంచవచ్చునని, సెక్షన్ 80 ఐబిని మరొక ఐదేళ్ల కాలానికి తిరిగి ప్రవేశపెట్టవచ్చునని రాజేష్ వర్ధన్ సూచించారు.
బిల్డర్లకు ఆదాయం పన్ను మినహాయింపును కూడా ఈ పరిశ్రమ ప్రధానంగా కోరుతున్నది. పార్శ్వనాథ్ గ్రూప్ చైర్మన్ ప్రదీప్ జైన్ ఈ విషయమై మాట్లాడుతూ, 'ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80 ఐబి కింద పన్ను రాయితీల తేదీని ఆర్థిక మంత్రి పొడిగిస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పారు. రియల్టీ రంగం చేస్తున్న ఇతర అభ్యర్థనలలో అధిక ఎఫ్ఎస్ఐ, పరిశ్రమ హోదా కల్పన కూడా ఉన్నాయి.
టౌన్ షిప్ ల నిర్మాణం కోసం బయటి నుంచి వాణిజ్య రుణ సేకరణ (ఇసిబి)ని అనుమతిస్తున్నారు. దీని గడువు పొడిగింపు వల్ల గృహాల నిర్మాణం పెరగడానికి వీలు కలుగుతుంది. అయితే, డెవలపర్లకు అప్పుగా తెచ్చిన నిధులకు సంబంధించిన వ్యయం ఎక్కువగా ఉంటున్నది. దీర్ఘ కాలిక రుణం కూడా తేలికగా లభించడం లేదు. విదేశీ నిధులను తక్కువ ఖర్చుతో సమీకరించడానికి వెసులుబాటు కల్పించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. టౌన్ షిప్ ల నిర్మాణంలో ఇసిబికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించాలని కూడా వారు కోరుతున్నారు. ఆస్తుల లావాదేవీలపై స్టాంపు డ్యూటీ రేట్లను తగ్గించాలని, ఈ రేట్లు అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చూడాలని రియల్టీ రంగం కోరుతున్నది.
Pages: -1- 2 News Posted: 9 February, 2010
|