కొత్త పుంతల్లో వాలంటైన్స్ ఎబర్ క్రోంబీ అండ్ కెంట్ అనే సంస్థ పర్యాటక విభాగాధిపతి ఆదిత్య త్యాగి మాట్లాడుతూ, గతంలో మాల్దీవులు, ధాయిలాండ్, ఇండోనేషియా వంటి ప్రాంతాలకు హనీమూన్ ను జరుపుకునేందుకు ఎక్కువగా వెళ్లేవారని, ఈ సారి వాలంటైన్స్ డే కోసం వెళ్లేందుకు ప్రేమ జంటలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. యూఎస్, యూరప్ వంటి ప్రాంతాలతో పోల్చుకుంటే మాల్దీవులు, ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో కాస్త తక్కువ డబ్బుకే వీలైనంత ఎక్కువ వసతులు పొందే అవకాశం ఉండటం, విమానయాన సౌకర్యాలు మెరుగ్గా ఉండటం కూడా ఇందుకు కారణమని ఆయన చెప్పారు. మరికొంతమంది ఇదే సమయంలో తమ వ్యాపారాలకు సంబంధించిన పనులను కూడా షెడ్యూల్ గా పెట్టుకుని ధాయ్ లాండ్, ఇండోనిషియా ప్రాంతాలకు వెళుతున్నారని త్యాగి చెప్పారు.
మాల్దీవులుకు చెందిన బన్యాన్ ట్రీ రిసార్ట్స్ వాలంటైన్స్ డే కోసం ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేసింది. కళ్లు మిరుమిట్లు గొలిపేలా బీచ్ ను తీర్చిదిద్ది, వెన్నెల వెలుగులో ప్రేమికులకు డిన్నర్ ఏర్పాటు చేయడంతో పాటుగా టెంటడ్ పూల్స్ లో బాడీ మసాజ్ వంటి ఆకర్షణీయ ఆ ఫర్ ను ఆ రిసార్ట్స్ ప్రకటించింది. అలాగే ధాయ్ లాండ్ కు చెందిన అమరి హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థ సముద్ర తీరం పక్కన, పర్వత ప్రాంతాల్లో 11 చోట్ల ఉన్న రిసార్ట్స్ లో వాలంటైన్ డే కోసం ఏర్పాట్లు చేస్తోంది.
Pages: -1- 2 News Posted: 9 February, 2010
|